'టెస్టుల్లో అనుభవమే లేని రోహిత్‌ను ఎలా ఆడనిచ్చారు'

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మకి టీమిండియా మేనేజ్‌మెంట్ తుది జట్టులో చోటివ్వడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ బుధవారం 12 మందితో కూడిన భారత్ జట్టుని ప్రకటించగా.. గురువారం హనుమ విహారిపై వేటు వేస్తూ తుది జట్టులో రోహిత్‌కి అవకాశమిచ్చి 11మందితో కలిసి బరిలోకి దిగింది. కాగా, కుప్పకూలిన టాపార్డర్‌లో రోహిత్ కూడా ఓ భాగమైనందున సోషల్ మీడియాలో అతనిపై ట్రోలింగ్ మొదలైంది.

రోహిత్‌కి ఎలా అవకాశమిస్తారు
టెస్టుల్లో మెరుగైన రికార్డు లేని రోహిత్‌కి ఎలా అవకాశమిస్తారు..? అని సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సంవత్సరారంభంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆఖరిగా 5 రోజుల ఫార్మాట్‌లో ఆడిన రోహిత్ శర్మ.. ఆ పర్యటనలో పేలవంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో 2 టెస్టులాడి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన పరుగులు 78 మాత్రమే. దీంతో.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌తో సిరీస్‌లకి రోహిత్‌ని ఎంపిక చేయకుండా సెలక్టర్లు పక్కన పెట్టేశారు.
బెంచ్‌కే పరిమితమవ్వాల్సిన హనుమ విహారి
కానీ.. ఇటీవల ఆసియా కప్, వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో సెంచరీల మోత మోగించిన రోహిత్ శర్మకి మరోసారి ఆస్ట్రేలియా గడ్డపై సెలక్టర్లు అవకాశమిచ్చారు. దీంతో ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీస్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసి హాఫ్ సెంచరీ బాదడంతో పాటు 3 వికెట్లు పడగొట్టిన హనుమ విహారి బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది.
38వ ఓవర్‌లో సిక్స్ బాదిన రోహిత్ శర్మ
గురువారం మొదలైన అడిలైడ్ టెస్టులో 61 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 2ఫోర్లు, 3సిక్సుల సాయంతో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చినప్పటి వన్డే తరహా బ్యాటింగ్‌తో ఈ హిట్టర్ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో.. స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన ఇన్నింగ్స్ 38వ ఓవర్‌లో సిక్స్ బాదిన రోహిత్ శర్మ.. తర్వాత బంతిని కూడా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి ఫీల్డర్‌కి దొరికిపోయాడు.
రోహిత్ 61 బంతుల్లో 37 పరుగులు
కాగా, తొలి టెస్టులో జట్టు మొత్తం పేలవ ప్రదర్శన చేస్తూ.. అవుటవ్వగా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన వారిలో రోహిత్ కూడా ఒకడు. కెప్టెన్ కోహ్లీయే 3పరుగులు అవుటవగా రోహిత్ 61 బంతులు ఆడి 37 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications