
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై ట్విట్టర్‌లో జోకులు పేలుతున్నాయి. మంజ్రేకర్ చేసిన ఓ ట్వీట్ ముంబై వాసుల ఆగ్రహానికి గురైంది. నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా రోహిత శర్మ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ టోర్నీకి సంజయ్ మంజ్రేకర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా తన ట్విట్టర్‌లో 'ముంబైని శుభ్రం చేయడానికి ఓ మంచి చీపురివ్వండి.. ఇది కొలంబలో దొరుకుతుంది. ఎందుకంటే శ్రీలంక ఇప్పటికే స్వచ్చ్ శ్రీలంకగా మారిందని' ట్వీట్ చేశాడు. మంజ్రేకర్ చేసిన ఈ ట్వీట్ ముంబై వాసులను కించపరిచేలా ఉందని మండిపడుతున్నారు.
'ఐపీఎల్ డబ్బులు ఉపయోగించి ముంబైని శుభ్రం చేయవచ్చుకదా' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... 'నువ్వెప్పుడైనా స్వచ్ఛ్ కార్యక్రమంలో పాల్గొన్నావా' అని మరొక నెటిజన్ మంజ్రేకర్‌ను ప్రశ్నించాడు. జనాభా ఎక్కువ గల ముంబైని ఓ చిన్న నగరంలో పోల్చడం సరికాదంటూ మంజ్రేకర్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ముక్కోణపు టీ20 సిరిస్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు పైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఆదివారం కొలంబో వేదికగా జరిగే పైనల్లో భారత్ తలపడుతుంది.