న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కులం చిచ్చు: బ్రాహ్మణులకు ఆ లైసెన్స్ ఉంది: సురేష్ రైనా..సమర్థించిన రవీంద్ర జడేజా: ఫ్యాన్స్ ఆన్ ఫైర్

Twitterati slams Suresh Raina and Ravindra Jadeja for their casteist tweets
Ravindra Jadeja, Suresh Raina కుల వివాదం కథ | Brahmin | Rajput Boy | CSK | Oneindia Telugu

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టాప్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తోన్న చెన్నై సూపర్ లీగ్ టీమ్‌ మేట్స్.. ఆల్ రౌండర్స్ సురేష్ రైనా, రవీంద్ర జడేజా కొత్తగా వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. వారిద్దరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒక కులానికి మాత్రమే పరిమితమయ్యేలా తయారయ్యారంటూ మండిపడుతున్నారు. భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించిన క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ మాత్రం సమర్థించట్లేదంటూ తేల్చి చెబుతున్నారు అభిమానులు. అభిమానులు, తోటి క్రికెటర్లను కులాలవారీగా విభజించి చూసే క్రికెటర్లను బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

బ్రాహ్మణిజంపై కామెంట్స్..

క్రికెట్ నుంచి తప్పుకొన్న సురేష్ రైనా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో కొనసాగుతోన్నాడు. రవీంద్ర జడేజా టీమిండియా విజయాల్లో కీ రోల్‌‌గా ఉంటోన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న భారత జట్టులో సభ్యుడతను. వారిద్దరూ ఐపీఎల్ మెగా టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ కొనసాగుతోన్న దశలో సురేష్ రైనా బ్రాహ్మణిజంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. దాన్ని సమర్థించేలా రవీంద్ర జడేజా ట్వీట్ చేయడం మరింత వివాదాస్పదమైంది.

బ్రాహ్మణ క్రికెటర్ల పట్ల..

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ టోర్నమెంట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నాడు సురేష్ రైనా. తాను బ్రాహ్మణుడినంటూ కులాన్ని బయటపెట్టాడు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వాడినే అయినప్పటికీ- తమిళ బ్రాహ్మణుల అలవాట్లను సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నానని పేర్కొన్నాడు. తమిళ బ్రాహ్మణ సంస్కృతి, సంప్రదాయాలను తాను అమితంగా ప్రేమిస్తానని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ టీమ్‌ మేట్స్ అనిరుద్ధ్ శ్రీకాంత్, సుబ్రమణియన్ బద్రినాథ్, లక్ష్మీపతి బాలాజీలను తమిళ బ్రాహ్మణ సంప్రదాయాలను చాలా నేర్చుకున్నానని అన్నాడు.

గొప్ప అడ్మినిస్ట్రేటర్లు..

తాము (బ్రాహ్మణులు) మంచి పరిపాలనదక్షులమని చెప్పాడు. బ్రాహ్మణులు తమకు తాముగా అద్భుతాలను సృష్టించుకోవడానికి తమకు లైసెన్స్ ఉందని వ్యాఖ్యానించాడు. సంప్రదాయాలను ప్రేమిస్తామని అన్నాడు. సంప్రదాయాలకు విలువను ఇచ్చే చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో భాగస్వామి కావడం గర్వంగా ఉందని, ఈ ఫ్రాంఛైజీ తరఫున మరిన్ని మ్యాచ్‌లను ఆడతానని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అతను చేసిన ఈ వ్యాఖ్యలను రవీంద్ర జడేజా సమర్థించాడు. ఈ మేరకు అతను ఒక ట్వీట్ చేశారు. #Rajput boys forever అంటూ వ్యాఖ్యానించాడు.

ఇండియన్ ఫస్ట్

ఈ క్యాస్టిజానికి సంబంధించిన వ్యాఖ్యలు.. అభిమానులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేశాయి. మొదట తాము భారతీయులమనే విషయానని వారిద్దరూ విస్మరించారని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరి వరకూ భారతీయుడిగానే జీవించాల్సి ఉంటుంది తప్ప.. కులం ప్రస్తావనను తీసుకుని రాకూడదని హితబోధ చేస్తోన్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించిన సురేష్ రైనా గానీ.. ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడుతున్న రవీంద్ర జడేజాను గానీ కులం చూసి వారిని జట్టులోకి తీసుకోలేదనే విషయాన్ని గుర్తించాలని సూచిస్తోన్నారు. కోట్లాదిమందిని స్ఫూర్తిని నింపే క్రికెటర్లు ఇలా ఒక కులానికి పరిమితం కాకూడదని అంటున్నారు.

Story first published: Friday, July 23, 2021, 10:55 [IST]
Other articles published on Jul 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X