England vs India: రూ. 50లక్షల వాచ్ పెట్టావ్.. మాస్క్ మాత్రం మరిచిపోయావ్!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అతడి సతీమణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఆటతో కోహ్లీ.. సినిమా, పాప అలనాపాలనతో అనుష్క ఫుల్ బిజీ. అంత బిజీలో కూడా.. ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత, వృత్తికి సంబందించిన ప్రతి విషయాన్ని ఈ ఇద్దరు అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఆమె అభిమానుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. విషయంలోకి వెళితే...

చేతికి ఖరీదైన వాచ్:
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ప్రస్తుతం లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఇటీవలి కాలంలో టీమిండియా ప్లేయర్స్ ఎక్కువగా బుడగలోనే ఉంటున్నారు. అందుకే భారత క్రికెటర్లకు బీసీసీఐ మూడు వారాల విశ్రాంతిని ఇచ్చింది. విరామ సమయంల్లో కూతురు వామికాతో కలిసి విరుష్క జోడి పలు పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క తన సెల్ఫీని షేర్ చేశారు. స్టైలిష్ హెయిర్ కట్‌తో బ్లాక్ అండ్ వైట్ టాప్ ధరించడంతో పాటు చేతికి ఖరీదైన వాచ్‌ను పెట్టుకున్నారు.

మాస్క్ మాత్రం మరిచిపోయావ్:
అనుష్క శర్మ పెట్టుకున్న రోలెక్స్ వాచ్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అనుష్క పెట్టుకున్న రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కే ధర 65,879 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 50లక్షలు). ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆమె పెట్టుకున్న ఖరీదైన వాచ్ గురించి కొందరు అభిమానులు మాట్లాడుకుంటే.. ఇంకొందరు మాత్రం మాస్క్ మర్చిపోయావ్ అని ట్రోల్ చేశారు. 'రూ. 50లక్షల వాచ్ పెట్టావ్.. మాస్క్ మాత్రం మరిచిపోయావ్' అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే అంతకుముందు అనుష్క ఇంకో వీడియోలో మాస్క్ పెట్టుకోమని అభిమానులను కోరడం విశేషం.

వామికాకు 6 నెలలు:
మంగళవారం (జులై 13న) విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కుమార్తె వామికా 6వ నెలకు అడుగుపెట్టడంతో ఒక పార్క్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనుష్క షేర్ చేసిన ఓ ఫొటోకు 'నీ నవ్వు మా ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తుంది. నీ ప్రేమతోనే మేము జీవిస్తున్నాం. మా ముగ్గురికి ఆరు నెలల శుభాకాంక్షలు' అంటూ రాసుకొచ్చారు. అయితే ఇప్పటికి కూడా వామికా ఫేస్ కనిపించకుండా వారు జాగ్రత్తలు పడుతున్నారు. ఫ్యాన్స్ మాత్రం వామికా ముఖాన్ని చూపించాలని విరుష్కలను కోరుతూనే ఉన్నారు. కానీ వారు అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం:
అనుష్క చివరి సారిగా 2018లో 'జీరో' సినిమాలో నటించారు. ఇందులో షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత అనుష్క పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇటీవల నిర్మాతగా మారిన అనుష్క.. పలు వెబ్ సిరీస్‌లను నిర్మించి ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇందులో పటల్ లోక్, బుల్బుల్ సిరీస్‌లు బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం 'ఖాలా' అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇక భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications