హైదరాబాద్: పాకిస్థాన్ ఆటగాళ్లు మహమ్మద్ అమీర్, మహమ్మద్ అసిఫ్, సల్మాన్ భట్‌లు 2010 ఇంగ్లాండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని రుజువు కావడంతో ఐదేళ్ల పాటు క్రికెట్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడేళ్ల తర్వాత మళ్లీ అలాంటిదే పాక్ క్రికెట్‌ను ఊపేస్తోంది.
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని పాకిస్థాన్‌కు చెందిన ఖలీద్ లతీఫ్, షర్జిల్ ఖాన్‌లపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వేటు వేసింది. దుబాయిలో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో వీరిద్దరిపై వేటు వేసినట్లు పీసీబీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

వివరాల్లోకి వెళితే పాక్ సూపర్ లీగ్‌లో ఖలీద్ లతీఫ్, షర్జిల్ ఖాన్‌లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ సహకారంతో విచారణ చేపట్టిన పీసీబీ, వారిద్దరికీ ఫిక్సింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేసింది.
పాకిస్థాన్‌లో కొత్త స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ వెలుగు చూడటంతో ట్విట్టర్‌లో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశం కూడా సాహశించడం లేదు. ఈ నేపథ్యంలో తాజా ఫిక్సింగ్ స్కాండల్‌పై ట్విట్టర్‌లో జోకులు పేలుతున్నాయి.