Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ధోనీనే పంత్ డ్రాప్ అవమని బలవంతపెట్టాడా?'

Twitterati agitated with the decision to drop Rishabh Pant in the 4th ODI

హైదరాబాద్: వెస్టిండీస్‌తో బ్రబౌర్న్ వేదికగా సోమవారం జరుగుతున్న నాలుగో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తుది జట్టులో అనూహ్య మార్పులు చేశాడు. టీమిండియా‌కి రెండో వికెట్ కీపర్‌గా భావిస్తున్న రిషబ్ పంత్‌‌ని తుది జట్టు నుంచి తప్పించి.. అతని స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి అవకాశమిచ్చాడు. దీంతో.. అరంగేట్రం చేసిన వన్డే సిరీస్‌లోనే ఈ 21ఏళ్ల యువ హిట్టర్‌ వేటుకి గురయ్యాడు.

త్వరలో వెస్టిండీస్‌తో జరగబోతున్న మూడు టీ20ల సిరీస్‌కి ధోనీని తప్పించి మరీ.. ఈ యువ కీపర్‌కి ఇటీవల సెలక్టర్లు చోటివ్వడంతో.. అతడికి మరిన్ని అవకాశాలిస్తారని అంతా భావించారు. వెస్టిండీస్‌తో గౌహతి వేదికగా ముగిసిన తొలి వన్డేలో రిషబ్ పంత్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. అయితే.. విశాఖపట్నం వన్డేలో ఆ అవకాశం దక్కినా.. 13 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

 పంత్‌ని తప్పించడంపై భిన్నాభిప్రాయాలు

పంత్‌ని తప్పించడంపై భిన్నాభిప్రాయాలు

ఆ తర్వాత.. శనివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలోనూ కీలక సమయంలో పేలవరీతిలో 18 బంతుల్లో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో.. నాలుగో వన్డేకి అతడ్ని తుది జట్టు నుంచి కెప్టెన్ కోహ్లీ తప్పించాడు. రిషబ్ పంత్‌ని తుది జట్టు నుంచి తప్పించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వన్డే కెరీర్‌ని ఆరంభించిన అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండాలని కొంతమంది వాదిస్తుండగా.. తుది జట్టులోకి ఆల్‌రౌండర్‌ని తీసుకోవడం మంచి నిర్ణయంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు.

పంత్‌ను డ్రాప్ అవమని ధోనీనే

పంత్‌ను డ్రాప్ అవమని ధోనీనే బలవంతపెట్టాడా?

ధోనీ స్థానం కోసం పంత్‌ను తప్పించి:

రిషబ్ పంత్‌ను తీసేసి ధోనీ స్థానాన్ని అతనికి అప్పగించారు. కచ్చితంగా ఇదొక వివాదమై తీరుతుంది. ఒక వేళ పంత్‌ను జట్టులోకి తీసుకుంటే ధోనీ వికెట్ కీపింగ్ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది.

ఫామ్‌లో లేనిది ఎవరు

ధోనీయా.. పంతా.. ఫామ్‌లో లేనిది ఎవరు? వేటు పంత్ పైనా.. ఇది సిగ్గు చేటు

అంత ఘోరం తానేం చేశాడు

తుది పదకొండు మందిలో రిషబ్ పంత్ లేడెందుకు? అంత ఘోరం తానేం చేశాడు?

Story first published: Monday, October 29, 2018, 16:04 [IST]
Other articles published on Oct 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+