న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుస ఓటములు ఎంత పనిచేశాయి!: ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీని తప్పించండి

IPL 2019 : Royal Challengers Bangalore Fans Want Virat Kohli Sacked For Poor Performance | Oneindia
 Twitter wants Virat Kohli to be sacked as the RCB captain

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆర్సీబీ వరుస ఓటములు విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు తెచ్చింది. ఈ సీజన్‌లో ఇప్పటికే కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో ఆట పట్ల కోహ్లీ అంకితభావం చూపిస్తున్నప్పటికీ ఓటములు అతడి కెప్టెన్సీని సందిగ్ధంలో పడేశాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆర్సీబీ వరుసగా నాలుగు

ఈ సీజన్ ఆరంభంలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడాన్ని అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ మార్చి 8 నుంచి వరుసగా 7 మ్యాచుల్లో ఓటమిపాలయ్యాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.

ముంబై ఇండియన్స్‌తో

ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ ఓడిపోయింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 113 పరుగులకే ఆలౌటైంది. తద్వారా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ అత్యధిక పరుగులు (118) తేడాతో విజయం సాధించింది.

రాజస్థాన్‌ రాయల్స్‌‌తో

ఇక, మంగళవారం జైపూర్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇప్పటివరకు 100 మ్యాచ్‌లాడగా అందులో 55 మ్యాచ్‌ల్లో ఓడగా.. 45 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అంతేకాదు గత పదకొండు సీజన్లలో ఒక్కసారిగా ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవలేకపోయింది.

విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్

విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... ఆ జట్టుని విజయాల్లో నడిపించలేకపోతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 70 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Story first published: Wednesday, April 3, 2019, 18:50 [IST]
Other articles published on Apr 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X