న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఎంత పనిచేసింది!: కోహ్లీ పదవికి ఎసరు, టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ

IPL 2019,Final : Twitter Wants Rohit Sharma As India’s T20I Captain ! || Oneindia Telugu
Twitter wants Rohit Sharma as India’s T20I captain

హైదరాబాద్: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు రోహిత్ శర్మ. అంతేనా నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్. ఐదు ట్రోఫీలు గెలిచిన ఐపీఎల్ జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీకి తిరుగులేదు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఉప్పల్ వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మకు ఇది 10వ ఐపీఎల్ పైనల్ మ్యాచ్. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.

అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్, రోహిత్ శర్మ ఇద్దరూ ఇప్పటివరకు 10 ఐపీఎల్ ఫైనల్స్ ఆడారు. ఇక, ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ధోని, సురేశ్ రైనా(14 ఐపీఎల్ పైనల్స్)తో అగ్రస్థానంలో ఉన్నారు.

2007లో వరల్డ్ టీ20 క్యాంపెయిన్‌తో కలిపి రోహిత్ శర్మ ఆడిన 10 టీ20 ఫైనల్స్‌లో 9 మ్యాచ్‌ల్లో తాను ప్రాతినిథ్యం వహించిన జట్టు విజయం సాధించింది. రోహిత్ శర్మ తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ని 2009లో నెగ్గాడు. అప్పట్లో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఆ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

2013లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ మొట్టమొదటిసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత 2015, 2017, 2019లలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిళ్లను సొంతం చేసుకుంది. దీంతో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నాలుగు ఐపీఎల్ టైటిళ్లను నెగ్గాడు. దీంతో రోహిత్ శర్మను టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరైన టోర్నీలకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా శ్రీలంక వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ట్విట్టర్‌లో నెటిజన్ల కామెంట్లు ఇలా:

Story first published: Tuesday, May 14, 2019, 14:26 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X