చెన్నై జట్టు ప్రమోషనల్ సాంగ్‌లో టెండూల్కర్‌కు అవమానం జరిగిందట

Posted By:
Twitter trolls MS Dhoni’s Chennai Super Kings

హైదరాబాద్: చెన్నై జట్టు ప్రమోషనల్ సాంగ్‌పై విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండేళ్ల నిషేదాన్ని పూర్తి చేసుకుని పునరాగమనం చేస్తోన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుపై ఆరోపణలు మొదలైయ్యాయి. ఈ విషయంపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పదకొండో సీజన్‌‌కు మహీ కెప్టెన్సీలో అడుగుపెడుతున్న సీఎస్‌కే ఫ్రాంచైజీ ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు సచిన్‌ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. దీంతో అప్రమత్తమైన సీఎస్‌కే జట్టు తమ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ నుంచి ఈ వీడియోను తొలగించింది.

తొలగించినప్పటికి తమ ఆరాధ్య దైవం, అభిమాన క్రికెటర్‌ను కించపరిచేలా సీఎస్‌కే వ్యవహరించిందంటూ సచిన్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అభిమానులను ఆకట్టుకోవాడినికి ప్రమోషనల్ సాంగ్‌ను తమిళ బాషలో రూపొందించారు. ఈ వీడియోలో సచిన్‌ జెర్సీ తీగ మీద నుంచి జారి కిందపడుతూ ఉండే సన్నివేశం ఉంటుంది.

ఇదే అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అనంతరం తమిళ నేటివిటికి తగ్గట్టు.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పోస్టర్లు, ఐపీఎల్‌ సమయంలో యువత గడిపే సన్నివేశాలతో ఈ వీడియోను రూపొందించారు. సెంటిమెంట్‌తో జట్టును ప్రజల్లోకి తీసుకెళ్దామంటూ ఎంత ప్రయత్నించినా.. అభిమానులు అసంతృప్తిగానే ఉన్నారు. ప్రస్తుతం అభిమానులు ఈ వీడియోను 'షేమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌' అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, March 30, 2018, 18:28 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి