హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్లలో ధోని ఒకడు. అలాంటి ధోని పని అయిపోయిందంటూ నెజిటన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 40 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
రెండో టీ20లో విరాట్ కోహ్లి(65), ధోని(49)లు ఆకట్టుకున్నప్పటికీ భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలోలో భారత్ పూర్తిగా తడబడింది. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా కివీస్ బౌలర్ శాంట్నర్ వేసిన 17 ఓవర్‌లో స్టంపింగ్‌ను తప్పించుకునే క్రమంలో ధోని చేసిన ఫీట్ జిమ్నాస్ట్‌ను తలపించింది.

శాంట్నర్ వేసిన బంతి ధోని బ్యాట్‌ను దాటి కివీస్ కీపర్ ఫిలిప్స్ చేతుల్లో పడింది. ఆ సమయంలో ధోని క్రీజులో కాస్త ముందుకు ఉన్నాడు. అంతే కీపర్ చేతుల్లోకి బంతి వెళ్లిన మరుక్షణమే తన రెండు కాళ్లను పొడవుగా చాసిన ధోని బ్యాలెన్స్ చేస్తూ ఉండిపోయాడు. ఒకవేళ కాలి తీస్తే బెయిల్స్‌ను కొడదామనుకున్నకాసేపు బంతి పట్టుకుని చూసిన ఫిలిప్స్‌కు ధోని అవకాశం ఇవ్వలేదు.
ధోని చేసిన ఈ ఫీట్‌పై అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. 36 ఏళ్ల ధోనీ పనైపోయిందని, ఇంత లాంగ్ స్ట్రెచ్ ఎలా చేశాడో తన కెరీర్‌ను కూడా అలాగే పొడిగిస్తున్నాడని ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేశారు. నెటిజన్లు చేసిన కామెంట్స్ మీ కోసం....