న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వినూత్నంగా ఔట్: ఫకార్ జమాన్ ఎల్బీపై ట్విట్టర్‌లో నెటిజన్ల జోకులు

Asia Cup 2018 : Fakhar Zaman’s ‘Slog-Sweep’ Attempt Is Now A Meme
Twitter trolls Fakhar Zaman over his weird dismissal

హైదరాబాద్: ఆసియాకప్‌లో భాగంగా సూపర్-4లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసి వినూత్నంగా ఔటైన పాకిస్థాన్ ఓపెనర్ ఫకార్ జామన్‌పై ట్విట్టర్ వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి.

పాక్‌పై సెంచరీ: ఓపెనర్‌గా 5000, రోహిత్ శర్మ ఖాతాలో అనేక రికార్డులుపాక్‌పై సెంచరీ: ఓపెనర్‌గా 5000, రోహిత్ శర్మ ఖాతాలో అనేక రికార్డులు

కుల్దీప్‌ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో స్లాగ్‌ స్వీప్‌ షాట్‌ ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఫఖర్‌ వికెట్ల ముందు అడ్డంగా పడిపోగా అంపైర్‌ వెంటనే ఎల్బీగా ప్రకటించాడు. దీనిపై సందిగ్ధం వ్యక్తం చేస్తూ నాన్‌ స్ట్రైకర్‌ను అడగ్గా అతను ఏం చెప్పకపోవడంతో ఫకార్‌ జమాన్ పెవిలియన్‌‌కు చేరాడు.

ఫీల్డ్ అంఫైర్ కూడా ఫకార్‌ను ఔట్‌గానే ప్రకటించాడు. అయితే రీప్లేలో బంతి అతని గ్లవ్‌కు తాకిందని తేలింది. అప్పీల్‌కు వెళితే ఫకార్‌ జమాన్ బతికిపోయేవాడు. అయితే, ఇక్కడ బంతిని ఎదుర్కొనే క్రమంలో క్రీజులో ఫకార్ జమాన్ పడిపోయిన విధానంపై ట్విట్టర్‌లో జోకులు పేలుతున్నాయి.

'ఫకార్‌.. ధావన్‌ కోసం పిచ్‌ శుభ్రం చేస్తున్నావా?' అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా, మరొక నెటిజన్ ఫకార్‌ను వెంటనే జింబాంబ్వే పంపించాలని ట్వీట్ చేశారు. బ్యాటింగ్‌ చేయమంటే ఫకార్‌ మాధురీ దీక్షిత్‌లా డ్యాన్స్‌ చేస్తున్నాడని, స్వచ్ఛ భారత్‌ ప్రచారంలో భాగంగా ఫకార్‌ తనవంతు కృషిచేస్తున్నారని ట్విట్టర్‌లో ట్రోల్‌ చేస్తున్నారు.

దుబాయి వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (111 నాటౌట్‌), శిఖర్‌ ధావన్‌ (114) సూపర్‌ సెంచరీలతో రాణించడంతో పాక్‌పై భారత్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది.

చర్చలు ఫలించేనా?: త్వరలో భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్!చర్చలు ఫలించేనా?: త్వరలో భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్!

టోర్నీలో భాగంగా సూపర్-4లో మంగళవారం భారత్-ఆప్ఘన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మరొవైపు ఇదే టోర్నీలో బుధవారం బంగ్లాదేశ్‌-పాక్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే, ఫైనల్లో మరోసారి భారత్‌తో తలపడనుంది.

Story first published: Monday, September 24, 2018, 17:07 [IST]
Other articles published on Sep 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X