Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2007లో అద్భుత ప్రదర్శన: 11 ఏళ్ల తర్వాత ఇంగ్లీషు గడ్డపై కార్తీక్

Twitter trolls Dinesh Karthik for being overanxious behind the wickets

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ చోటు దక్కించుకున్న తర్వాత ప్రత్యేకంగా వినిపిస్తోన్న పేరు దినేశ్ కార్తీక్. రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయపడటంతో దినేశ్‌ కార్తీక్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో కూడా వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు.

11 ఏళ్ల తర్వాత ఇంగ్లీషు గడ్డపై

11 ఏళ్ల తర్వాత ఇంగ్లీషు గడ్డపై

దీంతో దినేశ్‌ కార్తీక్‌ భారత టెస్టు జట్టులో ఆడి ఎన్ని సంవత్సరాలైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 11 సంవత్సరాలు. 2007లో రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో దినేశ్ కార్తీక్‌ ఇంగ్లాండ్‌ గడ్డపై ఆ జట్టుతోనే టెస్టు సిరీస్‌ ఆడాడు. ఆ పర్యటనలో దినేశ్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. లార్డ్స్‌, ట్రెంట్‌బ్రిడ్జ్‌, ఓవల్‌లో జరిగిన టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన దినేశ్‌ కార్తీక్ 60, 77, 91 రన్స్‌తో మెరిశాడు.

1-0తో సిరిస్‌ను దక్కించుకున్న భారత్

1-0తో సిరిస్‌ను దక్కించుకున్న భారత్

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-0తో దక్కించుకోవడంలోనూ దినేశ్ కార్తీక్ పాత్ర ఎనలేనిది. అంతేకాదు, ఆ పర్యటనలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఆ తర్వాత 2007లో ధోని భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేయడంతో దినేశ్‌ కార్తీక్‌ జట్టులో చోటు కోల్పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు దినేశ్ కార్తీక్‌కు అదే ఇంగ్లాండ్‌ గడ్డపై ఓ పూర్తి స్థాయి టెస్టు సిరిస్‌ను ఆడుతున్నాడు.

పార్దివ్‌ పటేల్‌ను కాదని దినేశ్ కార్తీక్‌‌వైపు మొగ్గు

పార్దివ్‌ పటేల్‌ను కాదని దినేశ్ కార్తీక్‌‌వైపు మొగ్గు

2007లో దినేశ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు తాజాగా పార్దివ్‌ పటేల్‌ను కాదని ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చోటు కల్పించారు. ఈ పర్యటనలో గనుకు దినేశ్ కార్తిక్ రాణిస్తే మరికొన్నాళ్లు టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఎందుకంటే భుజం గాయానికి సాహా శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనకు సాహా అనుమానమే

ఆస్ట్రేలియా పర్యటనకు సాహా అనుమానమే

దీంతో అతను కోలుకోవడానికి సులువుగా మూడు, నాలుగు నెలలు పడుతోంది. ఈ ఏడాది నవంబరులో ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు సాహా అనుమానమేనని ఇప్పటికే వార్త వచ్చింది. దీంతో నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరిస్‌కు సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటే ఇంగ్లాండ్‌ పర్యటనలో అతడి ప్రదర్శన కీలకం కానుంది.

Story first published: Wednesday, August 1, 2018, 19:05 [IST]
Other articles published on Aug 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+