For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఫేసర్ హెయిర్ స్టైల్ చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు

Twitter trolls Beuran Hendricks for his bizarre hairstyle

న్యూ ఢిల్లీ: మాన్సీ సూపర్ లీగ్‌లో జోజి స్టార్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న బెయిరాన్ హెండ్రిక్స్ నెటిజన్లకు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. మాన్సీ సూపర్ లీగ్ అరంగ్రేట సీజన్‌లో భాగంగా జోజి స్టార్స్ తరపున డ్యూన్నె ఒలివియర్, కగిసో రబడా, హెండ్రిక్స్‌లు ఉండటంతో ఆ జట్టు బౌలింగ్ విభాగంలో బలంగా కనిపిస్తోంది. ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపించే హెండ్రిక్స్ ప్రచారంలోనూ వైవిధ్యాన్ని కనబరిచాడు.

ఈ క్రమంలోనే 4రోజుల ఫ్రాంచైజీ సిరీస్‌లో కొత్త అవతారంలో కనిపించాడు. లయన్స్ జట్టుకు తరపున ఆడి నాలుగు మ్యాచ్‌లలో 21వికెట్లు తీసిన అరుదైన ఘనత హెండ్రిక్స్‌కే సొంతమైంది. ఇదే ఫామ్‌ను జోజి స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ కొనసాగించాడు. 7 గేమ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన వారిలో నాలుగోవాడిగా గుర్తింపుపొందాడు. హెండ్రిక్స్ 7 టీ20లు ఆడి 8వికెట్లు పడగొట్టాడు.

హెండ్రిక్స్ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడాడు. డర్బన్ వేదికగా 2014లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడిన మ్యాచ్‌లో టెస్టు అరంగ్రేటం చేశాడు. అయితే ఇప్పుడు కొత్త హెయిర్ స్టైల్‌తో ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా కనిపిస్తున్నాడు. జట్టును ఒక టోపీ ఆకారంలో హెయిర్ కట్ చేయించి ఒక రంగుతో దాని కింద భాగంలో పూర్తిగా జుట్టు లేకుండా కనిపిస్తుండటంతో ఏదో తలపైన ఒక టోపీ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్ల విమర్శలు, కితాబులు కనిపిస్తున్నాయి.

బ్యూరాన్ హెండ్రిక్స్ తలపైన ఉంది జుట్టేనా.. అలా జట్టు కత్తిరించుకున్నాడా.. రంగు వేయించుకున్నాడా.. నెత్తిమీద పొగ ఎందుకుంది.. అలా రబ్బరు ఎందుకున్నాడు.. అదేం హెయిర్ స్టైల్.. నాకు తెలిసి ఉమర్ అక్మల్ దీనిని కాపీ చేయడు కదా.. ఇదేదో కోడిపుంజులా ఉందే అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Wednesday, December 12, 2018, 16:54 [IST]
Other articles published on Dec 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+