For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఫస్ట్ నైట్ బాగా ప్రెజర్‌గా ఫీలయ్యాడేమో?: ట్విట్టర్‌లో ఓ నెటిజన్

Twitter tickles funny bones as Virat & Anushka get married

హైదరాబాద్: 'కోహ్లీ ఫస్ట్ నైట్ బాగా ప్రెజర్‌గా ఫీలయ్యాడేమో. యూరప్‌లో రికార్డులేం లేవ్ కదా.' ఇదేంటి అంటారా... కోహ్లీ పెళ్లిపై నెటిజన్ల కామెంట్స్. ఇప్పుడిదే ఇదే హాట్ టాపిక్. కొందరు అభినందనలతో వీరిని ముంచెత్తుతున్నారు. అంతేగాక, ట్వీట్లతోనూ చమత్కరిస్తున్నారు.

అనుష్కతో తన పెళ్లి గురించి ప్రకటిస్తూ కోహ్లి చేసిన ట్వీట్‌కు వచ్చిన స్పందనతో ట్విట్టర్ మార్మోగిపోయింది. అతి తక్కువ సమయంలో అత్యధిక మంది దీనిని రీట్వీట్‌ చేశారు. దీంతో 2017లో అత్యధికమంది రీట్వీట్‌ చేశారు. కాగా, 'గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ 2017' ఘనతను ఇది సొంతం చేసుకుంది.

అభినందనలే కాదు వీరి పెళ్లిపై జోకులు కూడా సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. పెళ్లి గురించి వెల్లడిస్తూ అనుష్క, విరాట్‌ ఒకేరకమైన మెసేజ్‌ను ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హాస్య ధోరణి వ్యక్తీకరిస్తూ 'నీ మెసెజ్‌ మస్తుంది. కాపీ చేసుకోవాలా?'అని కోహ్లి అడిగితే.. 'హా కాపీ చేసుకో.. కానీ ఫొటో మాత్రం మార్చు'అని అనుష్క బదులిచ్చినట్లు ఓ నెటిజన్‌ చమత్కరించాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో కొత్త జంటకు 'హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌'అంటూ అభినందనలు తెలిపారు. .దీనికి స్పందించిన కోహ్లి కృతజ్ఞతలు తెలిపాడు. ఇది జరిగిన సంభాషణ. దీనిని పొడిగిస్తూ.. ఫొటోషాప్ చేసి వ్యంగ్యంగా వేరేలా పోస్ట్ చేశారు. ప్రధాని చేసినట్టుగా 'ఇంకో మాట.. నీ పెళ్లి సర్టిఫికెట్‌ను ఆధార్‌తో డిసెంబర్‌ 31లోపు తప్పకుండా లింక్‌చేయి'అని పోస్ట్ చేశాడు.

'మొదటిరాత్రి విరాట్‌ ఒత్తిడిలో ఉండి ఉంటాడు. ఎందుకంటే యూరప్‌లోని అతనికి పెద్దగా రికార్డు లేదు' అంటూ ఓ నెటిజన్‌ చమత్కరించారు. 'భాయ్‌ నెక్ట్స్‌ మ్యాచ్‌ ఆడుతావా?' అని రోహిత్‌ అడిగితే.. 'నేను హనీమూన్‌లో ఉన్నా దుకాన్‌ బంద్‌' అంటూ ఓ నెటిజన్‌ జోకును పేల్చాడు. 'డ్యాండ్రఫ్‌ బనాదీ జోడీ' అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా పెళ్లికి ముందు వీడియోను పోస్ట్ చేయడం విరాట్ అనుష్కకే సాధ్యమైందని మరో వ్యక్తి చమత్కరించారు. ఇలా విరుష్క జంటకు శుభాకాంక్షలే కాదు. జోకులు కూడా కురుస్తున్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 13, 2017, 17:55 [IST]
Other articles published on Dec 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+