
లండన్: కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కేప్టెన్. ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను సాధించిన తరువాత అందరూ గెలిచిన జట్టును గానీ, ఆ జట్టును విజయం వైపు నడిపించిన కేప్టెన్‌ను గానీ ఆకాశానికెత్తేస్తారు. పొగడ్తలతో నింపేస్తారు. దేవుడంటూ ఆరాధిస్తారు. అంతకుమించి అభిమానిస్తారు. ఇది సాధారణంగా జరిగేదే. ప్రపంచకప్ టోర్నమెంట్ విజేత విషయంలో అంతా రివర్స్‌లో నడుస్తోంది. విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టును గానీ, ఆ జట్టు కేప్టెన్ ఇవాన్ మోర్గాన్‌ను గానీ ఎవరూ పెద్దగా ప్రస్తావించట్లేదు. ఆ జట్టు ఘనతను చెప్పుకోవట్లేదు. ప్రస్తుతం అందరి దృష్టీ కేన్ విలియమ్సన్‌పై నిలిచింది.
ఓటమి ఎదురైనా చెరిగిపోని చిరునవ్వుతో కనిపించిన కేన్ విలియమ్సన్‌ను సూపర్ హీరోగా గుర్తిస్తున్నారు అభిమానులు. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదు. భారత్, పాకిస్తాన్ సహా క్రికెట్ ప్రేమికులందరూ విలియమ్సన్ గొప్పదనాన్ని ప్రస్తావిస్తున్నారు. వందలు, వేలు, లక్షల్లో ట్వీట్లు చేస్తున్నారు. ఫలితంగా- ఇవాన్ మోర్గాన్ గానీ, ఇంగ్లండ్ జట్టు గానీ ట్రెండింగ్‌లో లేదు. కేన్ విలియమ్సన్ అనే పదాలు ప్రస్తుతం ట్విట్టర్‌ను షేక్ చేసి అవతల పడేస్తున్నాయి. టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించిన బెన్ స్టోక్స్ పేరు సైతం ట్రెండింగ్‌లో లేకపోవడం గమనించదగ్గ విషయం.
{headtohead_cricket_2_4}