న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్ ఓడింది.. అంపైర్లు గెలిచారు'

 Twitter ridicules the umpiring standards during India’s match against Afghanistan

న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచ్‌లన్నింటిలోనూ భారత్ విజేతగా నిలుస్తూ వస్తుంది. ఈ క్రమంలో భారత్ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అనూహ్య ఫలితాన్ని ఎదుర్కొంది. సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్న టీమిండియా.. పసికూన అఫ్ఘనిస్తాన్‌పై గెలవలేకపోయింది. వరుస వికెట్లను కోల్పోయి ఎలాగైతే మ్యాచ్‌ను టైగా ముగించింది. ఈ వికెట్లు కోల్పోవడంలో అంపైర్లు తప్పిదాలు చాలానే ఉన్నాయి.

ఈ విషయంపై మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ మాట్లాడుతూ అంపైర్ తప్పిదాలు మాత్రమే కాదని అన్నాడు. ఓపెనర్లు ఔటైన తర్వాత దినేశ్ కార్తీక్‌తో కలిసి ధోనీ ఇన్నింగ్స్ నిర్మిస్తున్న క్రమంలో అంపైర్ తప్పిదానికి ఔటయ్యాడు. అఫ్గాన్ బౌలర్ జావెద్ అహ్మదీ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్ 5వ బంతిని ధోనీ డిఫెన్స్ ఆడగా బంతి ప్యాడ్లకు తాకింది. బౌలర్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ గ్రెగరీ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) ఏమాత్రం ఆలోచించకుండా ఔటిచ్చారు. బంతి స్టంప్స్‌ను తాకలేదని రీప్లేలో స్పష్టంగా కనిపించింది.

నబీ వేసిన ఇన్నింగ్స్ 40 ఓవర్ నాలుగో బంతిని దినేష్ కార్తీక్ (44) ఆడేందుకు చూడగా బంతి ప్యాడ్లను తాకింది. నబీ అప్పీల్ చేయగానే అంపైర్ అనిసర్ రహమాన్ (బంగ్లాదేశ్) ఔట్‌గా ప్రకటించాడు. కేఎల్ రాహుల్ ఔట్ విషయంలో భారత్ రివ్యూను కోల్పోవడంతో ధోనీకిగానీ, కార్తీక్‌కుగానీ రివ్యూకు వెళ్లే అవకాశం లేక పెవిలియన్ బాట పట్టారు. కుల్దీప్, కేదార్ జాదవ్ ఔట్ కావడం భారత అభిమానులను నిరాశకు గురిచేసింది.

దీంతో భారత్ పరాజయానికి అంపైర్ల తప్పిదాలేనంటూ నెట్టిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఈ అంపైర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాల్సిందే

ఐసీసీ, బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మంచి అంపైర్లను నియమించండి. మంగళవారం మ్యాచ్‌లో తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది.

నిన్నటి మ్యాచ్ డ్రా అవడానికి కారణం
1. పేలవమైన అంపైరింగ్
2. కేఎల్ రాహుల్, ఐసీసీ, బీసీసీఐలు రివ్యూ విషయంలో అంపైర్లపై చర్య తీసుకోవాలి.

తప్పుడు నిర్ణయం. ధోనీ నాటౌట్. కానీ, ధోనీ రిటైర్ అవ్వాలంటున్నారు. నేను చెప్పేదేమంటే అంపైర్లు రిటైర్ అవ్వాలి.

భారత్ గెలవకపోవడానికి కారణం. అంపైర్ల తప్పే. ఈ మ్యాచ్‌లో అంపైర్లే గెలిచారు.

ఆసియా కప్‌లో ఇంతటి చెత్త అంపైరింగా. ప్రతి జట్టుకు రెండు రివ్యూలు ఉండాలి. రెండు బ్యాటింగ్ చేసేటప్పుడు, 2 బౌలింగ్ చేసేటప్పడు. ఈ మ్యాచ్‌లో రెండు తప్పుడు ఎల్బీడబ్ల్యూలు నమోదయ్యాయి. అవి నాటౌట్‌గా స్పష్టంగానే ఉన్నా అవుట్ ఇచ్చేశారు.

Story first published: Wednesday, September 26, 2018, 18:03 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X