బెన్ స్టోక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత: ఐపీఎల్ వేలం ట్వీట్లు 7,70,000

హైదరాబాద్: బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఐపీఎల్ వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజులు సోషల్ మీడియాలో ఐపీఎల్ గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఈ రెండు రోజుల్లో ఐపీఎల్ గురించి చేసిన ట్వీట్లు 7,70,000. ఈ ట్వీట్లలో ఎక్కువ మంది నెటిజన్లు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ గురించి ఎక్కువ ప్రస్తావించారు.
అంతేకాదు ఈసారి ఐపీఎల్ వేలాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 335శాతానికి పెరిగింది. తాజాగా ట్విటర్ గణాంకాలను ఓ సర్వే సంస్థ వెల్లడించింది. ఇందులో జనవరి 27, 28న ఐపీఎల్ గురించే నెటిజన్లు ఎక్కువ ట్వీట్లు చేసినట్లు తెలిపింది.
'ఐపీఎల్ ఆక్షన్ 2018' హ్యాష్ ట్యాగ్ పేరిట సుమారు 7,70,000లకు పైగా ట్వీట్లు నమోదయ్యాయి. అందులో 2,30,000 ట్వీట్లు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై నమోదయ్యాయి. ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో బెన్ స్టోక్స్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 12.5 కోట్లకు సొంతం చేసుకుంది.
ట్విట్టర్‌లో ఐపీఎల్ ప్రాంఛైజీల హ్యాండలర్స్:
@ChennaiIPL - Chennai Super Kings
@rajasthanroyals - Rajasthan Royals
@DelhiDaredevils - Delhi Daredevils
@KKRiders - Kolkata Knight Riders
@lionsdenkxip - Kings XI Punjab
@mipaltan - Mumbai Indians
@RCBTweets - Royal Challengers Bangalore
@SunRisers - SunRisers Hyderabad
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications