Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరంగేట్ర టెస్ట్‌లో అనేక రికార్డులు: మయాంక్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

Ind vs Aus 3rd Test Day 1:Mayank Agarwal Scores A Fifty On Debut,Twitter Celebrates
Twitter reacts as Mayank Agarwal scores a fifty on debut in the Boxing Day Test

హైదరాబాద్: తన అరంగేట్రం టెస్టులో మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం మెల్ బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు.

తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలం కావడంతో బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలను పంపిస్తూ జట్టు మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తనకు వచ్చిన అవకాశాన్ని మయంక్ చక్కగా వినియోగించుకున్నాడు.

1
43625
 ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్‌మన్‌లా

ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్‌మన్‌లా

ఎంతో అనుభవం ఉన్న బ్యాట్స్‌మన్‌లాగా ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఆసీస్ బౌలర్లు బౌన్సర్లతో బెంబేలెత్తించినా బెదరకుండా క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్ర టెస్ట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాట్స్‌మన్‌గా మయాంక్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 71 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్‌లో

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్‌లో

1947 డిసెంబర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసిన దత్తు ఫాడ్కర్(51).. ఆసీస్ గడ్డపై ఆరంగేట్ర టెస్టులో హాఫ సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు మయాంక్ అగర్వాల్ (76) పరుగులతో ఆ రికార్డుని అధిగమించాడు. 27 ఏళ్ల మయాంక్ మెల్‌బోర్న్ టెస్ట్‌లో నిలకడగా ఆడాడు.

ఆత్మవిశ్వాసంతో కనిపించిన మయాంక్

ఆత్మవిశ్వాసంతో కనిపించిన మయాంక్

క్రీజులో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తొలి రెండు టెస్టుల్లో భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన స్పిన్నర్ నాథన్ లియాన్‌పై మయాంక్ ఎదురు దాడికి దిగాడు. ఓపెనర్ విహారితో కలిసి తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన మయాంక్, పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగులు జోడించాడు.

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76), ఛటేశ్వర్ పుజారా (68) హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 215/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా(68), విరాట్ కోహ్లీ (47) పరుగులతో క్రీజులో ఉన్నారు. మయాంక్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Wednesday, December 26, 2018, 14:19 [IST]
Other articles published on Dec 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+