రాజపక్స ఇన్నింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్స్..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 137 పరుగులకే కుప్పకూలింది. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిందా టీమ్. పంజాబ్ కింగ్స్‌లో భానుక రాజపక్స ఇన్నింగ్ హైలైట్. హ్యాట్రిక్ సిక్సర్లను అందుకున్నాడీ శ్రీలంకన్ ప్లేయర్. ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ సిక్సర్లు అతని బ్యాట్ నుంచి జాలువారినవే. కేకేఆర్ బౌలర్ శివమ్ మావి వేసిన ఇన్నింగ్ నాలుగో ఓవర్‌లో రాజపక్స తొలి బంతిని బౌండరీ దాటించాడు. రెండు, మూడు, నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ తరువాతి బంతిని కూడా భారీ షాట్ ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యాడు. టిమ్ సౌథీకి దొరికిపోయాడు.
బ్యాట్‌ను ఝుళిపించిన రబడ..
మొత్తం మీద రాజపక్స తొమ్మిది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. 344 స్ట్రైక్ రేట్‌తో 31 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. అనంతరం ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. ఆ వేగాన్ని కొనసాగించలేకపోయారు. 10 ఓవర్లు ముగిసే సరికి సగం వికెట్లను కోల్పోయింది. ఒకదశలో 100 పరుగులు చేయడం కూడా కష్టమేనని పించింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ కగిసో రబడ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ స్కోర్ 137కు చేరుకుంది. భానుక తరువాత సెకెండ్ టాప్ స్కోరర్ అతనే. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 25 పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్ బౌలింగ్‌లో సౌథీకి చిక్కాడు.
టాప్ ఆర్డర్ విఫలమైన వేళ..
అనంతరం 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లు అజింక్య రహానె-12, వెంకటేష్ అయ్యర్-3 వెంటవెంటనే అవుట్ అయ్యారు. శ్రేయాస్ అయ్యర్-26, నితీష్ రాణా సున్నాతో పెవిలియన్ దారి పట్టారు. ఏడు ఓవర్లల్లో 51 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజ్‌లోకి దిగిన ఆండ్రీ రస్సెల్.. మ్యాచ్ గతిని మార్చివేశాడు. చాలాకాలం తరువాత తనదైన స్టైల్‌లో బౌలర్లపై సునామీలా విరుచుకుని పడ్డాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఏడు బంతుల్లో రెండే..
ఆండ్రీ రస్సెల్ తాను ఎదుర్కొన్న తొలి ఏడుబంతుల్లో చేసింది రెండు పరుగులే. ఆ తరువాతి 24 బంతుల్లోనే 68 పరుగులును పిండుకున్నాడు. మొత్తం మీద అతని ఇన్నింగ్‌లో ఎనిమిది సిక్సర్లు, రెండు ఫోర్లు నమోదయ్యాయి. 225.80 స్ట్రైక్ రేట్‌తో అతని బ్యాటింగ్ పరుగులు పెట్టింది. ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు. విన్నింగ్ షాట్ సిక్స్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కోల్‌కత వద్దే ఆరెంజ్.. పర్పుల్ క్యాప్స్
ఈ స్కోర్‌తో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడీ కరేబియన్ కింగ్. అంతకుముందు ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో చెలరేగడంతో పంజాబ్ 137 పరుగులకే ఆలౌటైంది. 4 వికెట్లతో ఉమేష్ యాదవ్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 72 మ్యాచ్‌లను ఆడాడు ఆండ్రీ. 1,795 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 30.42. స్ట్రైక్ రేట్ 179.32. అన్ని మ్యాచ్‌లల్లో కలిపి 122 బౌండరీలు బాదాడు. 154 సిక్సర్లు కొట్టాడు. బౌండరీల కంటే సిక్సర్ల సంఖ్య అధికంగా ఉండటం.. అతని పవర్ ప్లేకు అద్దం పట్టింది. బౌలింగ్‌లో 74 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ యావరేజ్ 26.69. ఐపీఎల్ వంటి ధనాధన్ ఫార్మట్‌లో ఓ ఆల్‌రౌండర్‌కు ఉండాల్సిన స్ట్రైక్ రేట్, యావరేజ్‌ను రికార్డ్ చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications












