ఫస్ట్ టైమ్ సన్‌రైజర్స్‌పై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం: ఆ పని చేసినందుకు

ముంబై: ఫలానా అని కాదు.. ఏ సీజన్‌లో అయినా కాస్త ఘాటుగా విమర్శలను ఎదుర్కొనే ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఏదైనా ఉందంటే అది- సన్‌రైజర్స్ హైదరాబాద్. మన రెండు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ దీన్ని తమ సొంత జట్టుగా ఆదరించడమే కారణం. అనుగ్రహించినా, ఆగ్రహించినా.. అది అభిమానం ఎక్కువ కావడం వల్లే. జట్టు వరుస ఓటములను ఎదుర్కొన్నప్పుడు ఘాటుగా కామెంట్స్ చేయడం, విజయాలు సాధించినప్పుడు ఎగిరి గంతులేయడం అలవాటే మరి.
గెలుపుగుర్రాలతో పాటు వారినీ..
కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. పడుతూ, లేస్తూ సాగుతోందీ జట్టు ఐపీఎల్ ప్రస్థానం. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లను సైతం సన్‌రైజర్స్ చేతులారా పోగొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దానికితోడు- మెగా ఐపీఎల్ వేలంపాట సందర్భంగా స్టార్లను తీసుకోవడంలో విఫలమైంది. చూస్తూ చూస్తూ గెలుపు గుర్రాలను వదులుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే సామర్థ్యం ఉన్న ప్లేయర్లు, ఆల్‌రౌండర్లను ఎంపిక చేసుకోలేకపోయింది.
సన్‌రైజర్స్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు
దాని ఫలితంగా- తొలి మ్యాచ్‌లో దారుణ ఓటమిని చవి చూసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్ తో ఓటమి తరువాత విమర్శల జడివానను ఎదుర్కొంది. ఇంత వ్యతిరేక పరిస్థితుల్లోనూ అభిమానులు సన్‌రైజర్స్‌పై ప్రశంసించడం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. చాలాకాలం తరువాత ఓ మంచి పని చేసిందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై సన్‌రైజర్స్‌ను అప్రిషియేట్ చేస్తోన్నారు ఫాలోవర్స్.
విజయ్ శంకర్, మనీష్‌లను వదులకోవడం పట్ల..
దీనికి కారణం- విజయ్ శంకర్, మనీష్ పాండే. ఇదివరకు వీరిద్దరూ సన్‌రైజర్స్‌లో ఆడిన విషయం తెలిసిందే. మెగా వేలంపాట సందర్భంగా వారిద్దరినీ వదులుకుంది ఈ ఫ్రాంచైజీ. మళ్లీ వారిని జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. అదే ఇప్పుడు సన్‌రైజర్స్‌ను కాపాడినట్టయింది. విజయ్ శంకర్, మనీష్ పాండే ఈ సీజన్‌లోనూ ఫ్లాప్ అయ్యారు. వారిద్దరూ వేర్వేరు ఫ్రాంఛైజీల తరఫున ఆడుతున్నారు గానీ.. అంచనాలకు తగ్గట్టుగా రాణించట్లేదు.
విజయ్ శంకర్ స్ట్రగుల్ కంటిన్యూస్..
విజయ్ శంకర్ గుజరాత్ టైటాన్స్‌లో, మనీష్ పాండే లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరారు. సీజన్ మారినా.. టీమ్ మారినా.. విజయ్ శంకర్ వైఫల్యాలు మాత్రం అతణ్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాణించలేదు. కీలకమైన వన్‌డౌన్‌గా బరిలోకి దిగిన విజయ్ శంకర్ 20 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క బౌండరీ నమోదైంది. బౌలర్‌గానూ ఫెయిల్ అయ్యాడు. ఒకే ఓవర్ వేసి 14 పరుగులు ఇచ్చాడు.
మనీష్ పాండే ఫెయిల్యూర్..
అటు లక్నో సూపర్ జెయింట్స్‌లో మనీష్ పాండే ప్రదర్శన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు, చెన్నైతో తలపడిన రెండో గేమ్‌లో అయిదు పరుగులు చేశాడు. ఆ ఇద్దరూ గనక సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉండి వుంటే జట్టు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారై ఉండదని అభిమానులు చెబుతున్నారు. వారిని వదులకుని మంచి పని చేసిందని ప్రశంసలు కురిపిస్తోన్నారు. ఈ విషయంలో చాలా ముందుచూపుతో వ్యవహరించిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications