Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విట్టర్ రియాక్షన్స్: అత్యల్ప స్కోరు నమోదు చేసిన జింబాబ్వే

Twitter Reactions: South Africa brush aside spirited Zimbabwe to a 1-0 lead

హైదరాబాద్: కింబర్లి వేదికగా జింబాబ్వేతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో సఫారీ బౌలర్లు విజృంభణతో దక్షిణాఫ్రికా జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 34.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మసకద్జా (25), చిగుంబురా (27) మినహా మిగతావారంతా పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, రబడ, ఫెలుక్వాయో, ఇమ్రాన్‌ తాహిర్‌ తలో 2 వికెట్లు తీసుకున్నారు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 26.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసి విజయం సాధించింది. సఫారీ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ క్లాసెన్‌ (44) పరుగులతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో చటారా, వెల్లింగ్టన్‌ మసకద్జాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి.

ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లుంగి ఎంగిడికి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే తక్కువ స్కోరుకే ఆలౌట్ కావడంతో ట్విట్టర్‌లో జోకులు పేలుతున్నాయి.

Story first published: Monday, October 1, 2018, 19:53 [IST]
Other articles published on Oct 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+