For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు: ధోనిపై ప్రశంసల వర్షం (ట్వీట్లు)

Twitter reactions on MS Dhoni’s fighting IPL half-century vs RR

హైదరాబాద్: చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ధోని (75 నాటౌట్, 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ధోనికి ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. 2018 ఐపీఎల్‌లో మొహాలి వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని (44 బంతుల్లో 79 నాటౌట్)కి ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చివరి ఓవర్‌లో ధోనీ మూడు సిక్సులు బాది తనదైన శైలిలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఫినిషింగ్ ఇచ్చాడు. అంతేకాదు 4.5 ఓవర్లగాను 27/3తో కష్టాల్లో ఉన్న జట్టుని ధోని... సురేశ్ రైనా(36) ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్‌ రెండో బంతిని జడేజా సిక్స్‌ కొట్టగా, మూడో బంతి వైడ్‌ అయ్యింది. అటు తర్వాత జడేజా సింగిల్‌ తీయగా, ధోని తనదైన శైలిలో రెచ్చిపోయాడు.

ఆఖరి ఓవర్‌లో మొత్తంగా 28 పరుగులు వచ్చాయి. దాంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు 176 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగింది. మంచు కురవడం ఎక్కువ అవడంతో బంతి స్పిన్నర్లకు అనుకూలించ లేదు. దీంతో రాజస్థాన్‌ విజయం ఖాయం అనుకున్నారంతా..

అయితే, మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ ధోనీ తెలివిగా అదే స్పిన్నర్లతో ఫలితాన్ని రాబట్టాడు. రాజస్థాన్‌ జట్టు బ్యాట్స్‌మెన్‌ కూడా వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ధోనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

Story first published: Monday, April 1, 2019, 15:02 [IST]
Other articles published on Apr 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+