
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును ప్రకటించారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జశ్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీలు ఉన్నారు. కాగా, అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.
వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటించడానికి ముందు సెలక్టర్లు సోమవారం ఉదయం సుప్రీం కోర్టుచే నియమింపబడిన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీతో పాటు ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యాడు.
వరల్డ్‌కప్‌కు భారత జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ