Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఓటమికి కారణం అతడే, శాస్త్రిని కోచ్ పదవి నుంచి తప్పించండి'

Twitter lashes out at coach Ravi Shastri as Kohli’s India lose England Test series

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో కోహ్లీసేన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగిలుండగానే ఆతిథ్య ఇంగ్లాండ్ 3-1తో కైవసం చేసుకుంది.

ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా సమిష్టిగా విఫలమైంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలవడంతో అటు కెప్టెన్ కోహ్లీతోపాటు కోచ్ రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, నాటింగ్ హామ్‌లో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు విజయం సాధించడంలో అభిమానులు కాస్త శాంతించారు. అయితే, సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీసేన కనీసం పోరాట పటిమ కూడా ప్రదర్శించకుండా సిరిస్‌ను చేజార్చుకోవడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.

1
42377

విదేశీ గడ్డపై వరుసగా రెండు టెస్టు సిరిస్‌ల్లో టీమిండియా ఓటమి పాలవడంపై అటు కోహ్లీతోపాటు కోచ్ రవిశాస్త్రిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అసలు రవిశాస్త్రి కోచ్‌గా పనికిరాడని, అతడిని వెంటనే కోచ్ పదవి నుంచి తప్పించాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 7 (శుక్రవారం) నుంచి ఓవల్ వేదికగా ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆతిథ్య ఇంగ్లాండ్ 3-1తేడాతో కైవసం చేసుకోవడంతో చివరి టెస్టు నామమాత్ర టెస్టు అయింది.

Story first published: Tuesday, September 4, 2018, 15:53 [IST]
Other articles published on Sep 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+