తమ్ముడు కోహ్లీ ఏం చేస్తున్నావ్?.. టీవీ చూస్తున్న సోదరా!!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 ఈ నెల 29న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ కోసం ఇప్పటికే కొందరు ఆటగాళ్లు సాధన మొదలెట్టారు. ఐపీఎల్ మొదలవనున్న సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ సోమవారం ట్విటర్‌లో సరదాగా చాటింగ్ చేసుకున్నారు.

టీవీ చూస్తున్న డివిలియర్స్:
కోహ్లీ ఏం చేస్తున్నావ్? అని డివిలియర్స్ అడగ్గా.. టీవీ చూస్తూ సేదతీరుతున్న అని కోహ్లీ రిప్లై ఇచ్చాడు. (అయితే సోఫా, టీవీ ఎమోజీలతో కోహ్లీ రిప్లై ఇచ్చాడు). వెళ్లి ప్రాక్టీస్ మొదలెట్టు అని అర్ధం వచ్చేలా క్రికెట్ బ్యాట్ ఎమోజీని డివిలియర్స్ రిప్లై పంపాడు. అందుకు బదులుగా కోహ్లీ ప్రశ్న గుర్తులు (???) పోస్ట్ చేసాడు. త్వరలో నిన్ను కలుస్తా అని ఓ వీడియోను డివిలియర్స్ పంపాడు. ఇక్కడితో ఇద్దరి సరదాగా చాటింగ్ ఆగిపోయింది.

వాట్సాప్ కాదు ట్విటర్:
కోహ్లీ, డివిలియర్స్ ట్విటర్‌లో వాట్సాప్‌లో చేసినట్లు చాట్ చేయడం గమనార్హం. ఇక్కడ ఇద్దరూ ఏమోజీలతో చాటింగ్ చేయడం మరింత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఇద్దరి చాటింగ్‌పై జోకులు పేల్చుతున్నారు. 'అయ్యో కోహ్లీ, ఏబీ.. ఇది వాట్సాప్ అనుకుంటున్నారేమో.. కాదు ట్విటర్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'మోజీలతో కాకుండా కొంచెం పదాలను వాడండి' అని మరో అభిమాని ట్వీటాడు. ఆర్సీబీలో ప్రపంచంలోని టాప్ ఆటగాళ్లున్నా ఆ జట్టు ఇప్పటి వరకూ టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే.

వన్డే సిరీస్‌లో ఫామ్ సాధించి:
విరాట్ కోహ్లీ ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో పూర్తిగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో గురువారం నుండి ప్రారంభం అయ్యే వన్డే సిరీస్‌లో ఫామ్ సాధించి ఐపీఎల్‌లో సత్తా చాటాలాని చూస్తున్నాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్.. మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున ఆడాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఏబీ తిరిగి జట్టులోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు.

షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్:
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను వాయిదా వేసే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేశ్ తోపె ఆదివారం వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ఐపీఎల్‌ను మాత్రం వాయిదా వేసే ప్రసక్తే లేదంటున్నాడు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ తొలి మ్యాచ్ ఈనెల 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై, చెన్నై జట్ల మధ్య జరగనుందని స్పష్టం చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications