

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో సెంచరీ నమోదు చేసిన శిఖర్ ధావన్ టీ20ల్లో మాత్రం ఇప్పటివరకు సెంచరీని సాధించలేకపోయాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్‌కు టీ20ల్లో సెంచరీ సాధించే అవకాశం వచ్చినప్పటికీ.... జట్టులోని సహచర ఆటగాడు కోలిన్ ఇన్‌గ్రామ్ అడ్డుపడటంతో దానిని అందుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.
అనంతరం 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగుు చేసింది. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97 పరుగులు చేసి శిఖర్ ధావన్ నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి 8 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి.
ఈ క్రమంలో ధావన్ సింగిల్ తీసి ఇన్‌గ్రామ్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత ఓ భారీ షాట్‌తో ఇన్‌గ్రామ్ మ్యాచ్‌ను ముగించేశాడు. దీంతో శిఖర్ ధావన్ సెంచరీ సాధించే అవకాశం చేజారింది. దీనిపై ధావన్ అభిమానులు ఇన్‌గ్రామ్‌పై సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మ్యాచ్ అనంతరం ధావన్ మాట్లాడతూ రికార్డుల కన్నా జట్టు గెలుపే ముఖ్యమని అన్నాడు.