టీమిండియాకు ట్వీట్ల శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు శుభారంభమే దక్కింది. టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లీషు గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. తొలి సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై చేయి సాధించింది. జూలై 8 ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను సైతం సాధించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు, ఆటగాళ్లు కోహ్లీసేనపై అభినందనల వర్షం కురిపించారు. ఇక నెటిజన్ల కామెంట్లతో సోషల్‌మీడియాలో టీమిండియా మోత మోగుతోంది.
టీమిండియాకు అద్భుత ఫలితం
‘మంచి వాతావరణం.. కలిసొచ్చిన పరిస్థితులు.. టీమిండియాకు అద్భుత ఫలితం. సిరీస్ గెలిచినందుకు శుభాకాంక్షలు. వన్డే మ్యాచుల్లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించండి. ఆల్ ది బెస్ట్'
ట్యాలెంట్ ఇంకా బతికే ఉంది
‘ఇంగ్లాండ్ సిగ్గు పడుతోంది.. ట్యాలెంట్ ఇంకా బతికే ఉంది.. రోహిత్ శర్మ సెంచరీ అద్భుతం. టీ20ల్లో అతడికి మూడో శతకం. ఇంకా ఇలాంటి సెంచరీలు మరిన్ని చేయాలి. కుంగ్‌ఫూ పాండ్య నుంచి అద్భుత కృషి ఉంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో రాణించాడు. ఈ విజయానికి టీమిండియాదే అర్హత'
ఆపరు.. ఆపలేరు..
‘ఆపరు.. ఆపలేరు.. హిట్‌మన్ రోహిత్‌శర్మ అద్భుతం.. మరో అద్భుతమైన లక్ష్యఛేదన.. ఇంగ్లిష్ వేసవికి మంచి ఆరంభం'
ఇలాంటి సహచరులతో కలిసి ఆడటం..
‘ఇలాంటి ప్రతిభావంతులైన సహచరులతో కలిసి ఆడటం.. సిరీస్‌ను గెలవడం గొప్ప అనుభూతి. ఇక సంబరాలు చేసుకోవాల్సిన సమయం'
ఇదే ఉత్సాహంతో మరో మ్యాచ్‌కు
‘టీ20 సిరీస్‌లో ఉత్కంఠభరితమైన ముగింపు. ఇంతకంటే ఆనందం, గర్వం ఉండదు. ఇదే ఉత్సాహంతో మరో మ్యాచ్‌కు వెళ్దాం'
రోహిత్‌శర్మ అందమైన సెంచరీ
‘టీమిండియా అద్భుత విజయం. ఇలాంటి గొప్ప జట్టులో భాగమవడం, సిరీస్‌ను గెలవడం గర్వంగా ఉంది. రోహిత్‌శర్మ అందమైన సెంచరీ.. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన'
మరిన్ని సాధిస్తాం. కంగ్రాట్స్:
‘ఇంగ్లాండ్ పర్యటనకు గొప్ప ప్రారంభం. ఈ జట్టులో భాగమవడం సంతోషంగా ఉంది. ఇలాంటి విజయాలు మరిన్ని సాధిస్తాం. కంగ్రాట్స్ రోహిత్ శర్మ'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications