Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండు నెలలు ఆర్మీకి సేవలు: ధోని నిర్ణయంపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం

Twitter hails Lt Colonel MS Dhoni after he takes break from cricket to serve his Territorial Army regiment

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై వస్తోన్న వార్తలకు పుల్ స్టాప్ పడింది. ఎందుకంటే ధోని రెండు నెలలు పాటు క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ వార్తలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం విండిస్ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో ధోనికి చోటు దక్కుతుందా? లేక విశ్రాంతినిస్తారా? అని సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదిలిన ప్రశ్న. అయితే, వీటన్నింటికి శనివారం సమాధానం లభించింది. ధోనినే ప్రపంచకప్ తర్వాత రెండు నెలల వరకు క్రికెట్‌కు దూరంగా ఉంటానని బీసీసీఐకి ముందే చెప్పాడు.

టెరిటోరియల్‌ ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌లో ధోనీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు నెలలు ధోని పారామిలటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఈ రెండు నెలలు ధోని పారాచూట్‌ రెజిమెంట్‌ విభాగంలో చేరి దేశ సైనికుడిగా సేవలందిస్తాడు. ఈ రెండు నెలలు ఆర్మీకి సేవలు అందించనున్నట్లు ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి తెలిపారు.

ఈ విషయాన్ని బీసీసీఐ సైతం అధికారికంగా ద్రుృవీకరించింది. దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "మూడు విషయాలపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. ధోని తనకు తానుగా వెస్టిండీస్‌ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. మరో రెండు నెలలు పారామిలటరీ రెజిమెంట్‌లో చేరి సేవలందిస్తాడు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించడం లేదు" అని అన్నారు.

రెండు నెలలు పాటు ధోని టెరిటోరియల్‌ ఆర్మీ పారాచూట్‌ రెజిమెంట్‌లో సేవలు అందించేందుకు వెళ్తుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు "ఇంతకన్నా మంచి వికెట్‌ కీపర్లు దొరకరు" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... "ధోనీ నిన్ను చూసి గర్విస్తున్నాను. సైన్యంలో నీకు మంచి సమయం దొరుకుతుందని భావిస్తున్నా" అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.

Story first published: Saturday, July 20, 2019, 18:31 [IST]
Other articles published on Jul 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+