Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరికి అందనంత ఎత్తులో: ధోని ఖాతాలో మరో వరల్డ్ రికార్డు

మొహాలి: భారత్, న్యూజిలాండ్ మధ్య మొహాలి వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో వికెట్ కీపర్‌గా ధోని ఎవరికీ అందనంత ఎత్తుకు చేరాడు. ఈ మ్యాచ్‌లో తన స్టెంపింగ్స్‌తో అదరగొట్టిన ధోని తన కెరీర్‌లో మరో మైలురాయికి చేరుకున్నాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో వరుస ఓవర్లలో రెండు స్టంపౌట్‌లు చేసి రాస్ టేలర్, రోంచిలను పెవిలియన్‌కు పంపాడు.

ఈ రెండు స్టింపింగ్‌లతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో చేసిన స్టింపింగ్‌ల సంఖ్య 151కి చేరుకుంది. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో వరల్డ్ రికార్డుగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు బీసీసీఐ అందించిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోని ఒకడు. 35ఏళ్ల ధోని 2004 నుంచి 2016 వరకూ మొత్తం 444 మ్యాచ్‌లలో 151 స్టంపింగ్‌లు చేసి ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు.

Twitter hails 'lightening quick' MS Dhoni behind wickets in 3rd ODI

139 స్టెంపింగ్‌‌తో రెండో స్థానంలో శ్రీలంక ఆటగాడు కుమార సంగర్కర ఉన్నాడు. కాగా మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 49.4 ఓవర్లలో 285 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ లక్ష్యం 286 పరుగులుగా నిర్దేశించింది.

భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, జాదవ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, మిశ్రా, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. మూడో వన్డేలో ధోని క్విక్ స్టంపింగ్‌పై ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+