ధోనికి సాధ్యం కాలేదు: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ముష్ఫికర్

హైదరాబాద్: ఢాకా వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్పికర్ రహీం అరుదైన రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీం డబుల్ సెంచరీ సాధించాడు.
మొత్తం 407 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో రహీం డబుల్ సెంచరీని సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ముష్ఫికర్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. 2013లో గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో ముష్ఫికర్ రహీం టెస్టుల్లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు.

సింగిల్ తీసి డబుల్ సెంచరీ చేసిన రహీం
జింబాబ్వే పార్ట్ టైమ్ బౌలర్ సికిందర్ రాజా వేసిన ఇన్నింగ్స్ 154వ ఓవర్‌లో ముష్ఫికర్ రహీం సింగిల్ తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు. ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. రెండో రోజు ఆటలో భాగంగా టీ విరామం అనంతరం ముష్ఫికర్ రహీం ఈ ఘనత సాధించాడు.

టెస్టుల్లో బంగ్లా తరుపున అత్యధిక స్కోరు
ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీం జింబాబ్వే బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అదే సమయంలో బంగ్లాదేశ్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన షకీబ్ ఉల్ హాసన్(217) పరుగుల రికార్డుని సైతం అధిగమించాడు. జనవరి, 2017లో వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో షకీబ్ ఈ ఘనత సాధించాడు.

చరిత్ర సృష్టించిన ముష్పికర్ రహీం
కాగా, ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీం 421 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 219 పరుగులు సాధించాడు. దీంతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో మోమినుల్ హక్(161) కూడా భారీ సెంచరీ చేయడంతో ఆ జట్టు ఐదొందల పరుగుల మైలురాయిని అందుకుంది.

తొలి ఇన్నింగ్స్‌ను 522/7 వద్ద డిక్లేర్ చేసిన బంగ్లాదేశ్
జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. 303/5 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ నిలకడగా బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌ను 522/7 వద్ద డిక్లేర్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications