వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో ఆడే 12 జట్లు కన్ఫర్మ్!

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడే 12 జట్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయిపోయాయి. ఈ ఏడాది గ్రూప్ దశలో పోరాడిన నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది ప్రపంచకప్ ఆడేందుకు నేరుగా అర్హత సాధించాయి. వీటిలో నెదర్లాండ్స్ కూడా ఉండటం గమనార్హం.

వచ్చే ఏడాది ప్రపంచకప్..
ప్రస్తుత టీ20 ప్రపంచకప్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీ ముగుస్తుంది. ఈ క్రమంలోనే అభిమానులు వచ్చే ప్రపంచకప్ గురించి చర్చ మొదలు పెట్టారు. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా 2024లో ఈ మెగా టోర్నీ జరగనుంది. అయితే ఈ టోర్నీలో ఆడేందుకు ఇప్పటికే 12 జట్లు అర్హత సాధించాయి.

సఫారీ విజయంతో నెదర్లాండ్స్..
ఆదివారం నాడు అద్భుతంగా ఆడిన నెదర్లాండ్స్ జట్టు సంచలన విజయం సాధించింది. బలమైన సౌతాఫ్రికా జట్టుకు షాకివ్వడమే కాదు.. ఆ జట్టును ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి పక్కకు నెట్టేసింది. దీంతో గ్రూప్-2 నుంచి భారత జట్టు నేరుగా సెమీస్ చేరగా.. బంగ్లాదేశ్‌పై విజయంతో పాకిస్తాన్ కూడా సెమీస్ చేరింది. అంతేకాదు, సఫారీలపై విజయంతో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆడేందుకు నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించింది.

ఈ ఏడాది ఏం జరిగిందంటే..
వచ్చే టీ20 ప్రపంచకప్‌లో దశలో ఆడే 12 జట్లు నిర్ధరణ అయిపోయాయి. మొత్తం 20 జట్లు ఆడే ఈ టోర్నీలో 12 జట్లు ఏవో తేలిపోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రపంచకప్‌లో టాప్-8గా నిలిచిన జట్లు ఈ జాబితాలో ఉన్నాయి. సఫారీలపై విజయంతో నెదర్లాండ్స్ కూడా ఈ జాబితాలో చేరింది. ర్యాంకింగ్స్ కారణంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా అర్హత సాధించాయి. టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న కారణంగా యూఎస్, వెస్టిండీస్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రపంచకప్ అర్హత సాధించిన 12 జట్లివే: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిల్యాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఎస్ఏ, వెస్టిండీస్,
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications