Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నో బాల్​ నిర్ణయం థర్డ్‌ అంపైర్​దే!!

TV Umpires To Call Front Foot No-Balls In ODI Super League

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) త్వరలో ప్రారంభించే వన్డే ప్రపంచకప్ సూపర్​ లీగ్​లో ఫ్రంట్ ఫుట్ నో బాల్ నిర్ణయం థర్డ్‌ అంపైర్ (టీవీ అంపైర్) ప్రకటించనున్నారు. సూపర్​ లీగ్​లో ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ను థర్డ్‌ అంపైర్‌ పర్యవేక్షిస్తాడని ఐసీసీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. 2023 వన్డే ప్రపంచకప్ అర్హత కోసం.. ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్​-ఐర్లాండ్ జట్ల మధ్య ప్రారంభమయ్యే వన్డే సిరీస్​తో సూపర్ లీగ్ ప్రారంభం కానుంది.

గతేడాది భారత్​-వెస్టిండీస్ మధ్య జరిగిన సిరీస్​లో టీవీ అంపైర్​ నోబాల్ ప్రకటించే విధానాన్ని ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్​లోనూ ఐసీసీ ఈ పద్ధతిని వినియోగించింది. ఈ రెండు సందర్భాల్లో సరైన ఫలితాలు రావడంతో.. సూపర్​ లీగ్​లో ఫ్రంట్ ఫుట్ నోబాల్ నిర్ణయంను ఐసీసీ థర్డ్‌ అంపైర్​కే కట్టబెట్టింది.

2016లో ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో దీన్ని (నో బాల్​ నిర్ణయం థర్డ్‌ అంపైర్​దే) అమలు చేసినా.. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేసారు. అయితే మరోసారి ఈ పద్దతిని భారత్-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో ప్రయోగించింది. 12 మ్యాచ్‌ల్లో బౌలర్లు 4,717 బంతులు సంధించగా.. గీత దాటిన 13 నోబాల్‌లను థర్డ్‌ అంపైర్‌ గుర్తించారు. ఇందులో కచ్చితమైన నిర్ణయాలు కూడా వస్తున్నాయి. ఐసీసీ నిర్ణయంతో అన్‌ఫీల్డ్ అంపైర్ల పని మరింత సులువయింది.

కాగా భారత్ వేదికగా జరిగే 2023 ప్రపంచకప్ అర్హత ప్రక్రియ కోసం సూపర్ లీగ్​ను ఐసీసీ ఈ రోజే ఆవిష్కరించింది. ఈ లీగ్​లో టాప్​-7 జట్లు విశ్వటోర్నీకి నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య దేశంగా భారత్ నేరుగా టోర్నీకి క్వాలిఫై అయింది. మొత్తం 13 జట్లు సూపర్ ​లీగ్​లో తలపడనున్నాయి. 12 ఐసీసీ సభ్యదేశాలతో పాటు నెదర్లాండ్స్.. మొత్తంగా మొత్తం 13 జట్లు ఈ సూపర్​ లీగ్​లో పోటీ పడనున్నాయి. ఈ లీగ్​లో భాగంగా ప్రతి జట్టు స్వదేశంలో నాలుగు, విదేశాల్లో మూడు వన్డే సిరీస్​లు ఆడాలి.

Story first published: Monday, July 27, 2020, 20:46 [IST]
Other articles published on Jul 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+