ధోనీకి విశ్రాంతి ఇస్తే కష్టం: సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇస్తే చాలా కష్టమని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఏప్రిల్ 17న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
చివరగా 2010లో ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటే... సీఎస్‌కే తరుపున 121 మ్యాచ్‌లు ఆడిన ధోని విశ్రాంతి తీసుకున్నాడు. ధోని విశ్రాంతి తీసుకోవడంతో సురేశ్ రైనాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది.

ధోని వెన్నునొప్పిపై
తాజాగా, ధోని వెన్ను నొప్పి గురించి వార్తలు వస్తోన్న నేపథ్యంలో సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ కోచ్ మైక్ హస్సీ స్పందించాడు. హస్సీ మాట్లాడుతూ "ధోని అప్పుడప్పుడు వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. కానీ, అది అంత తీవ్రమైందేమి కాదు. ఒక్క మ్యాచ్ నుంచి కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదని ధోనీనే చెప్పాడు. ప్రస్తుతం ధోనీ వందశాతం ఫిట్‌గా ఉన్నాడు" అని చెప్పాడు.

చెన్నైకి ఆడటాన్ని ధోని ఆస్వాదిస్తున్నాడు
"ఈ సీజన్‌లో ధోని బ్యాట్‌తో రాణిస్తున్నాడు. చెన్నైకి ఆడటాన్ని ధోని ఆస్వాదిస్తాడన్న సంగతి తెలిసిందే. వాట్సన్ విషయంలో ధోని, ఫ్లెమింగ్ చూపించిన నమ్మకం గొప్పది. ఈ సీజన్‌లో వాట్సన్ వరుస మ్యాచ్‌ల్లో విఫలమైనా అతడికి అవకాశాలు ఇచ్చారు. ఐపీఎల్‌లాంటి లీగ్‌లో ఒక ఆటగాడికి అన్ని అవకాశాలు ఇవ్వడం మామూలు విషయం కాదు" అని హస్సీ అన్నాడు.

చెపాక్ వేదికగా చెన్నై, ముంబై మ్యాచ్
"ధోనీతో కలిసి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండటం నాకు గర్వంగా ఉంది. బ్యాట్స్‌మెన్ ఏ నంబర్‌లో వచ్చినా మంచి భాగస్వామ్యాలు చేయడం ముఖ్యం. సీఎస్‌కే దానినే నమ్ముకుంది" అని హస్సీ ఈ సందర్భంగా తెలిపాడు. టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం రాత్రి చెన్నై, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications