హైదరాబాద్ ఆటగాళ్లను తీసుకోకపోతే.. ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటాం: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ మినీ వేలం గురువారం చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలానికి రూ.10.75 కోట్లతో వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్).. ముగ్గురు ఆటగాళ్లని మాత్రమే కొనుగోలు చేసింది. వేలంలోకి హైదరాబాద్‌కి చెందిన క్రికెటర్లు వచ్చినా.. ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ మాత్రం వారిని కోలుగోలు చేయలేదు. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు మొహ్మద్ అజహరుద్దీన్ పెదవి విరచగా.. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆటగాళ్లను తీసుకోకపోతే.. ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటాం అని హెచ్చరించారు.

ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు:
శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐపీఎల్ 2021 వేలంపై స్పదించారు. 'ఐపీఎల్ మొదలయినప్పటి నుంచి అందరం చూస్తున్నాం. ఏ రాష్ట్రం వారు (ప్రాంచైజీ) ఆ స్టేట్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం అలా కాదు. ఇంత పెద్ద రాష్ట్రం, నగరంలో ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అదృష్టం బాగుండి మొహ్మద్ సిరాజ్.. దేశానికి ఆడుతున్నాడు. ప్రతిభతోనే ఆయన వెలుగులోకి వచ్చాడు. ఇక సచిన్ టెండూల్కర్ కుమారుడిని ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ మాత్రం లోకల్ ఆటగాళ్లని తీసుకోలేదు' అని ఎమ్మెల్యే దానం అన్నారు.

ఐపీఎల్ మ్యాచులను అడ్డుకుంటాం:
మ్యాచ్ ఫిక్సింగ్‌లో దొరికిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇది మాకు చాలా బాధాకరం. దీనిని మేము ఖండిస్తున్నాం. ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో స్థానిక ఆటగాళ్లకు స్థానం లేకపోవడం ఏంటి?. ఇప్పటికైనా హైదరాబాద్ ఆటగాళ్లకు సన్‌రైజర్స్ జట్టులో స్థానం కల్పించాలి. లేకపోతై ఫ్రాంచైజీ పేరైనా మార్చుకోవాలి. ఇదే తీరు కొనసాగితే హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ మ్యాచులను అడ్డుకుంటాం' అని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులు ఎక్కడ జరిగినా తాము మద్దతుగా నిలుస్తామన్నారు.

గత్ వర్మను పట్టించుకోలేదు:
చెన్నై సూపర్ కింగ్స్ తమకి భారంగా మారిన కేదార్ జాదవ్‌ని ఈసారి వేలంలోకి వదిలేయగా.. రూ.2 కోట్ల కనీస ధరతో అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అతనితో పాటు ముజీబ్ ఉర్ రెహ్మాన్ (రూ.1.5 కోట్లు), జె సుచిత్ (రూ.30 లక్షలు)లను హైదరాబాద్ కొనుగోలు చేసింది. మొత్తంగా వేలంలో రూ.3.8 కోట్లని మాత్రమే ఎస్‌ఆర్‌హెచ్ వెచ్చింది. దాంతో రూ. 6.95 కోట్ల పర్స్ మనీ అలానే ఫ్రాంఛైజీ వద్ద మిగిలిపోయింది. హైదరాబాద్‌కి చెందిన స్పిన్నర్ భగత్ వర్మ రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా.. అతడ్ని సన్‌రైజర్స్ పట్టించుకోలేదు. తెలుగు క్రికెటర్ హనుమ విహారి అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచాడు. రూ.1 కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చిన విహారిని ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు.

చాలా నిరాశపరిచింది:
అయితే కేఎస్ భరత్ (విశాఖ పట్నం), భగత్ వర్మ (హైదరాబాద్), హరిశంకర్ రెడ్డి (కడప) మాత్రం కనీస ధర రూ.20 లక్షలకే అమ్ముడుపోయారు. భరత్‌ని ఆర్సీబీ కొనుగోలు చేయగా.. భగత్, హరిశంకర్‌ని చెన్నై కొనుగోలు చేసింది. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో హైదరాబాద్‌కి చెందిన క్రికెటర్ ఒక్కరు కూడా లేకపోవడం చాలా నిరాశపరిచింది' అని మొహ్మద్ అజహరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications