రోహిత్ శర్మ చేసిన పుండు మీద కారం చల్లిన జింబాబ్వే..!!

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో చిన్న జట్లు పంజా విసురుతున్నాయి. మొన్నటికి మొన్న ఐర్లాండ్- తన కంటే ఎంతబలమైన ఇంగ్లాండ్‌ను ఓడించింది. డక్‌వర్త్ లూయిస్ విధానంలోనే అయినప్పటికీ- వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి.. ఆ లక్ష్యానికి ఆమడదూరంలో ఇంగ్లాండ్‌ను ఉంచగలిగింది ఐర్లాండ్. వీటి దెబ్బకు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా గుర్తాంపు ఉన్న వెస్టిండీస్ కనీసం సూపర్ 12లో అడుగు కూడా పెట్టలేకపోయింది.

జింబాబ్వే దెబ్బకు..
అక్కడితోనే వాటికి బ్రేక్ పడలేదు. పాకిస్తాన్ సైతం ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. జింబాబ్వే చేతిలో మట్టి కరిచింది. ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దాన్ని ఛేదించలేక చతికిల పడింది పాకిస్తాన్. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా రెండింటితోనే సరిపెట్టుకుంది. ఆల్‌రౌండర్ సికిందర్ రజా పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

పెను సంచలనం..
పాకిస్తాన్‌పై జింబాబ్వే సాధించిన ఈ విజయం క్రికెట్ ప్రపంచంలో పెనుసంచలనంగా మారింది. గతంలో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అప్పట్లో టైటిల్ హాట్ ఫేవరెట్ వెస్టిండీస్‌ను ఓడించిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. 130 పరుగులను కాపాడుకోవడంలో జింబాబ్వే ప్లేయర్లు చూపించిన తెగువను ప్రశంసించకుండా ఉండలేకపోతోన్నారందరూ. ఓడింది పాకిస్తాన్ కావడంతో ఇటు భారత్‌లోనూ సెలబ్రేషన్స్ మిన్నంటాయి. జింబాబ్వే జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్.

ట్రోల్స్ నో బ్రేక్..
ఈ దారుణ పరాజయం తరువాత పాకిస్తాన్‌పై ట్రోల్స్‌కు బ్రేకులు పడట్లేదు. కంటిన్యూగా కుప్పలు తెప్పలుగా పోస్టింగ్స్ వచ్చి పడుతూనే ఉన్నాయి. కేప్టెన్ బాబర్ ఆజమ్, ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లను టార్గెట్‌గా చేసుకున్న నెటిజన్లు ఇప్పుడు తమ ఫోకస్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌పై మళ్లించారు. పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాను లక్ష్యంగా చేసుకున్నారు. వారిద్దరిపైనా ఘాటు వ్యాఖ్యలు సంధిస్తోన్నారు.

మీకెందుకు కప్..
అసలే భారత్ చేతిలో ఓడిపోయిందేనే ఆగ్రహావేశాలతో ఉన్న పాకిస్తాన్ అభిమానులకు ఇది మరింత ఠారెత్తించింది. జింబాబ్వే చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతోన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా నిప్పులు చెరుగుతున్నారు. జింబాబ్వే చేతిలో మట్టి కరిచిన జట్టుకు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడే హక్కు లేదంటూ మండిపడుతున్నారు. వెంటనే తిరుగుముఖం పట్టాలంటూ హుకుం జారీ చేస్తోన్నారు. #PakBean, #zimbabar, #ramizraja హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications