Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS PAK: 'రేయ్.. ఇది వన్డేనా? టెస్ట్ మ్యాచా?' - పాకిస్థాన్ పై పేలుతోన్న సెటైర్లు

'రేయ్ ఓవర్లు కరిగిపోతున్నాయ్ స్కోరు ముందుకెళ్లదేంట్రా'... 'అరేయ్ ఆవలింతలు మొదలయ్యాయి'... 'జిడ్డూ బ్యాటింగ్ ఆడుతున్నారురా.. ఇది వన్డేనా..? టెస్ట్ మ్యాచా..?', '20 ఓవర్లలో 80 డాట్ బాల్సా?'.. 'బోరింగ్ గా ఉంది మావా, దీని కన్నా బంగ్లాతో జరిగిన మ్యాచే ఇంట్రెస్ట్ గా సాగింది కదరా'.. ఈ కామెంట్లు చదవగానే అర్థమైపోయి ఉండాలి దాదాపుగా.. తాజాగా భారత్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటింగ్ పై పేలుతున్నసెటైర్లు ఇవి.

India vs Pakistan Live స్కోరు కార్డు

తొలి 50 పరుగులు చేయడానికి 58 బంతులు, మరో 50 చేయడానికి ఏకంగా 97 బంతులు తీసుకుంది పాకిస్థాన్. దీంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ మ్యాచ్ తో పాటు పాక్ పై తెగ ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట్లో పాక్ బ్యాటింగ్ తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Trolls Memes flood social media on pakisthan batting in IND VS PAK champions trophy 2025

మరీ దారుణంగా కెప్టెన్ రిజ్వాన్..
ముందుగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టులో తొలి వికెట్ గా బాబర్ ఆజామ్.. హార్దిక్ పాండ్య బౌలింగ్ లో వెనుదిరిగాడు. అతడు 26 బంతుల్లో 23 పరుగులు చేసి ఢమాల్ అన్నాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హుక్ కూడా రనౌట్ గా వెనుదిరిగాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ దూకుడుగా ఆడుతాడనుకుంటే మరీ దారుణంగా జిడ్డూ బ్యాటింగ్ చేశాడు. 10 ఓవర్లో సౌద్ షకీల్ తో కలిసి బ్యాటింగ్ అందుకున్న అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. ఏదో టెస్ట్ క్రికెట్ ఆడుతున్నట్టుగా డిఫెన్స్ ఆడుతూ మెల్లగా స్కోరు బోర్డును తీసుకెళ్లారు.

న్యుజిలాండ్ పై బాబార్ కూడా..
ఫలితంగా తొలి 120 బంతుల్లో మొత్తంగా 80 డాట్ బాల్స్ నమోదయ్యాయి. 10 నుంచి 20 ఓవర్ల మధ్య కేవలం 27 పరుగులే రాబట్టారు. 20వ ఓవర్ వచ్చేసరికి కేవలం 13 పరుగులు చేశాడు రిజ్వాన్. దీంతో రిజ్వాన్ తో పాటు పాకిస్థాన్ పై సెటైర్లు పేలుతున్నాయి. కాగా, అంతకుముందు తమ తొలి మ్యాచ్ న్యూజిలాండ్ పై బాబార్ ఆజామ్ కూడా జిడ్డూ బ్యాటింగ్ చేసి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలసిందే.

Story first published: Sunday, February 23, 2025, 18:03 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+