కీపర్ క్యాచ్
సూర్యకుమార్ ఆట చూస్తే టీమిండియా అభిమానులు అమ్మయ్యా అని అనుకున్నారు. కానీ అతను రవుఫ్ బౌలింగ్ షార్ట్ పిచ్ బంతిని బౌండరీ తరలించే ప్రయత్నంలో కీపర్ రిజ్వాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ ఔట కావడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు.
7 ఓవర్లకే 4 వికెట్లు
దీంతో టీమిండియా 7 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా మ్యాచ్ లో టాస్ ఓడిన పాకిస్థాన్ 20 ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లను హర్ష్ దీప్ త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్, ఇఫ్తికార్ జట్టును ఆదుకున్నారు. షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇఫ్తికా అహ్మద్ 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు.
హర్ష్ దీప్, పాండ్యా
భారత్ బౌలర్లలో హర్ష్ దీప్ 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టగా.. మహ్మద్ షమీ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఒక ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 21 పరుగులించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.


Click it and Unblock the Notifications
