T20 World Cup 2022: రాహుల్ ఏంటిదీ.. ఓపెనర్ ఔట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్

టీ20 వరల్డ్ కప్ పాకిస్థాన్ తో జరుగుతున్న సూపర్ 12 మ్యాచ్ లో భారత్ తడబడుతోంది. తక్కువ స్కోర్లకే ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత శర్మ ఔటయ్యారు. రెండు ఓవర్లో కేఎల్ రాహుల్ బౌల్డ్ అయ్యాడు. నసీం షా బౌలింగ్ బంతిని ఆడడానికి ప్రయత్నించగా బాల్ బ్యాట్ ను తాకి వికెట్లకు తాకింది. దీంతో కేఎల్ రాహుల్ 4 పరుగులకే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ ఔట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.
ఇఫ్తికా అహ్మద్
కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన పాకిస్థాన్ బ్యాటింగ్ కు దిగింది. 20 ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లను హర్ష్ దీప్ త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్, ఇఫ్తికార్ జట్టును ఆదుకున్నారు. షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇఫ్తికా అహ్మద్ 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్ కు తన మొదటి ఓవర్ లోనే హర్ష్ దీప్ షాకిచ్చాడు. పాక్ కె ప్టెన్ బాబర్ అజాం ను ఎల్బీడబ్యూగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ హర్ష్ దీప్ బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసి ఊపు మీద ఉన్న ఇఫ్తికార అహ్మద్ ను మహ్మద్ షమీ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
హర్ష్ దీప్
భారత్ బౌలర్లలో హర్ష్ దీప్ 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టగా.. మహ్మద్ షమీ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఒక ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 21 పరుగులించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ కూడా తక్కువ పరుగులే ఔటయ్యాడు. 4 పరుగులు చేసిన రోహిత్ శర్మ రవుఫ్ బౌలింగ్ లో స్లిప్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ దూకుడూగా ఆడాడు. షాట్ ఆడే క్రమంలో కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications