
హైదరాబాద్: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రెచ్చగొట్టి వివాదానికి గురైయ్యాడు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలె గిబ్స్. వీరిద్దరూ ట్విట్టర్‌లో సంభాషణ చేసుకుంటూ చురకలంటించుకున్నారు. గిబ్స్ అశ్విన్‌కు చురక అంటించబోతే.. తిరిగి అశ్విన్ అతడికి గట్టి పంచ్ ఇచ్చాడు.
ఓ షూ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్న అశ్విన్ 'ఈ బూట్లు ధరిస్తే సౌకర్యంగా ఉండడంతోపాటు వేగంగా పరిగెత్తవచ్చు' అని ట్వీట్ చేశాడు. ఆ సంస్థ షూలు ఎప్పుడెప్పుడు వేసుకుందామా అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. దీనిపై గిబ్స్ సరదాగా స్పందిస్తూ.. ''అశ్విన్.. నువ్వు ఇప్పుడైనా కొంచెం వేగంగా పరుగెత్తుతావని ఆశిస్తున్నా'' అన్నాడు. ప్రస్తుత టీమిండియాలో అశ్విన్ వికెట్ల మధ్య అంత వేగంగా పరిగెత్తకపోవడాన్ని ఉద్దేశించి గిబ్స్ ఆ విధంగా అన్నాడు.
నాకు కొన్ని విలువలు ఉన్నాయి' అని అశ్విన్ ఘాటుగా తిప్పికొట్టాడు. 2001లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో తన పాత్ర ఉందని గిబ్స్ అప్పట్లో అంగీకరించడంతో క్రికెట్ సౌతాఫ్రికా అతడిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
'కచ్చితంగా నేను నీ అంత వేగంగా పరుగెత్తలేను. కానీ మ్యాచ్‌లు ఫిక్స్ చేయకుండా నైతికతతో ఆడే మనసు మాత్రం నాకుంది' అని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌తో నొచ్చుకున్న గిబ్స్.. జోక్‌ను స్వీకరించలేని అశ్విన్ వేరే అంశంలోకి వెళ్లిపోయాడని వ్యాఖ్యానించాడు. ఐతే తాను కూడా సరదాకే ఆ ట్వీట్ పెట్టానని.. ఏదైనా చూసే వాళ్ల దృష్టిని బట్టే ఉంటుందని అన్నాడు. త్వరలో మనిద్దరం విందుకెళ్దాం అంటూ గిబ్స్ మనసును తేలిక చేసే ప్రయత్నం చేశాడు అశ్విన్.