బ్యాట్ పడేశాడు.. హెల్మెట్ బాదుకున్నాడు! కోపంతో ఊగిపోయిన స్టార్ బ్యాటర్! (వీడియో)
ఐపీఎల్ 2026లో సీఎస్కే ఎట్టకేలక తన ఖాతాను తెరిచింది. ఇదిలా ఉండగా.. చెన్నైలోని ఎంఏ చిదంబరి స్టేడియం వేదికగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తకర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ స్టార్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ స్టేడియంలోనే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. చెన్నైలోని విపరీతమైన ఉక్కపోత, తేమ కారణంగా తన గ్లోవ్స్ తడిసిపోయాయని.. వాటిని మార్చుకుంటానని స్టబ్స్ కోరగా, ఆన్-ఫీల్డ్ అంపైర్లు అందుకు నిరాకరించారు.
అంపైర్లతో స్టబ్స్ వాగ్వాదం
మ్యాచ్ కీలక దశలో ఉండగా.. ఓవర్ మధ్యలో గ్లోవ్స్ మార్చడం వల్ల సమయం వృథా అవుతుందని అంపైర్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం స్టబ్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. అప్పటికే అద్భుతంగా ఆడుతున్న ఆయన.. ఈ అంతరాయం వల్ల తన బ్యాటింగ్ ఫామ్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టబ్స్ ఔటయ్యాడు. పెవిలియన్ చేరుకునే క్రమంలో ట్రిస్టన్ స్టబ్స్ అంపైర్లతో వాగ్వాదానికి దిగడమే కాకుండా.. డ్రెస్సింగ్ రూమ్ మెట్ల వద్ద తన బ్యాట్‌ను పడేసి.. హెల్మెట్‌ను బాదుకుంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. సీఎస్కే స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 56 బంతుల్లోనే 115 పరుగులతో అజేయ సెంచరీ సాధించాడు. ఇది ఐపీఎల్ 2026 సీజన్‌లో నమోదైన తొలి సెంచరీ కావడం విశేషం. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే (59) కూడా అతనికి చక్కని సహకారం అందించారు.
పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్
213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. పవర్‌ప్లేలో కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సంకల ధాటికి 61 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలో పడింది. ట్రిస్టన్ స్టబ్స్ తన పోరాట పటిమతో 60 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ.. గ్లోవ్స్ వివాదం తర్వాత స్టబ్స్ ఔట్ కావడంతో ఢిల్లీ ఆశలు ఆవిరయ్యాయి. చివరికి ఢిల్లీ 189 పరుగులకు ఆలౌట్ కావడంతో, చెన్నై 23 పరుగుల తేడాతో ఈ సీజన్‌లో తన తొలి విజయాన్ని నమోదు చేసింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్లేయర్లు అనవసరంగా సమయాన్ని వృథా చేయకూడదు. ఓవర్ మధ్యలో పరికరాలు మార్చుకోవడం వల్ల బౌలర్ వేగానికి అడ్డుకలుగుతుందని అంపైర్లు భావిస్తారు. అందుకే స్టబ్స్ విన్నపాన్ని వారు తోసిపుచ్చారు. దీనిపై ఢిల్లీ కోచ్ హేమంగ్ బదాని కూడా ఫోర్త్ అంపైర్‌తో చర్చించడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications