మహిళా క్రికెటర్ ఆత్మహత్య!!

అగర్తలా (త్రిపుర): త్రిపుర అండర్-19 మహిళల క్రికెట్ జట్టు క్రీడాకారిణి అయంతి రీయాంగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 16 ఏళ్ల అయంతి మంగళవారం రాత్రి తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందినట్లు స్థానిక దినపత్రిక 'సియాండన్' ఓ ప్రకటనలో తెలిపింది. అయితే అయంతి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయంతి మృతిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక్కోమెట్టు ఎక్కుతూ:
త్రిపుర రాజధాని అగర్తలా నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయపూర్ ఏరియాలోని తెనాని అయంతి రీయాంగ్ స్వగ్రామం. అయంతి తన తల్లిదండ్రులకు నాలుగో సంతానంగా జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండే అయంతిని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. దీంతో ఆమె క్రికెట్ బాగా ఆడేవారు. ఇక క్రికెట్‌లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏడాది క్రితం భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు.

టీ20 జట్టుకు ప్రాతినిధ్యం:
అయంతి రీయాంగ్ త్రిపుర రాష్ట్రం తరఫున కూడా టీ20 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాదు త్రిపుర అండర్-23 జట్టులో కూడా ఆమె సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే అయంతి ఒక్కసారిగా మృతిచెందడంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అయంతి మృతిపట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిని కోల్పోయాం:
పీటీఐతో త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి తిమురా చందా మాట్లాడుతూ... రాష్ట్రం ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిని కోల్పోయిందన్నారు. 'అండర్-16 నుండి అయంతి రాష్ట్ర జట్టులో పాల్గొంది. ఆమెకు మంచి ప్రతిభ ఉంది. ఈ మరణ వార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది' అని అన్నారు. ఏదైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుందా అని అడగ్గా.. 'గత సీజన్ వరకు బాగానే ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఆటలు నిలిచిపోయాయి. మేము కొన్ని ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించాం. అప్పుడు బాగానే ఉంది. కానీ ఆమె కుటుంబ సమస్యల గురించి మాకు తెలియదు' అని తిమురా తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications