చెన్నైని ఓడించిన ట్రినిడాడ్,ఇక సెమీస్ కష్టమే..

మధ్య ఓవర్లలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... బరాత్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు) మినహా మిడిలార్డర్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన కరీబియన్ జట్టును.. చివరి ఓవర్లలో కూపర్ (10 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకుని గౌరవప్రదమైన స్కోరును అందించాడు. కూపర్ జోరుతో ట్రినిడాడ్ చివరి ఐదు ఓవర్లలో 49 పరుగులు సాధించడం విశేషం. చెన్నై బౌలర్లలో బొలింజర్ మూడు వికెట్లు తీసుకోవడం జరిగింది.
ఆ తర్వాత 123 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ నారైన్ అద్భుత బౌలింగ్‌తో చెన్నై బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. నారైన్ 4 ఓవర్లలో 8పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కూపర్, బద్రి కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి ఓడిపోయింది. స్పిన్నర్ నరైన్ (3/8) విజృంభించడంతో చెన్నై 27 పరుగులకే టాప్ ఆర్డర్ మూడు వికెట్లు కోల్పోయింది. బద్రీనాథ్ (15) మినహా మిడిలార్డర్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. కెప్టెన్ ధోని ఏకంగా 22 బంతులు ఆడి ఏడు పరుగులు చేశాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications