Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేల్ రికార్డ్ బద్దలు: 21 బంతుల్లో సెంచరీ చేసి, గెలిపించాడు

ట్రినిడాడ్: ట్రినిడాడ్ అండ్ టుబాగోకు చెందిన 23 ఏళ్ల క్రికెటర్ ఇరాక్ థామస్ అరుదైన రికార్డ్ సృష్టించాడు. ట్వంటీ 20ల్లో 21 బంతుల్లోనే శతకం సాధించి రికార్డ్ నెలకొల్పాడు. ఇరాక్ థామస్... లెజెండరీ ఆటగాడు బ్రయాన్ లారా గడ్డ నుంచి వచ్చాడు.

తాజా, శతకం ద్వారా అతను వెస్టిండీస్ స్ట్రా క్రిస్ గేల్ రికార్డును బద్దలు చేశాడు. ఈ మ్యాచ్ టుబాగో క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసింది. అతను 31 బంతుల్లో 131 పరుగులు చేశాడు.

తొలుత ప్రత్యర్థి జట్టు 151 పరుగులు చేసింది. 152 పరుగుల లక్ష్యంతో ఇరాక్ థామస్ జట్టు బరిలోకి దిగింది. ఈ దశలో ఇరాక్ థామస్ కేవలం 31 బంతుల్లో 131 పరుగులు చేశాడు. 21 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతను రెచ్చిపోయి ఆడటంతో కేవలం ఎనిమిది ఓవర్లలోనే మ్యాచ్ గెలుపొందింది. థామస్ 15 సిక్స్‌లు, అయిదు ఫోర్లు కొట్టాడు.

Trinidad's Iraq Thomas smashes T20 century in 21 balls, breaks Chris Gayle's record

ఇరాక్ థామస్ మాట్లాడుతూ.. తాను మరీ ఇంత వేగంగా ఆడుతానని అనుకోలేదని, కానీ కొన్ని బంతులను ఎదుర్కొన్నాక అనిపించిందని చెప్పాడు. ఏదైన ప్రత్యేకత జరుగుతుందని తాను ఊహించానని చెప్పాడు. గతంలో అతని బెస్ట్ 53 బంతుల్లో 97 పరుగులు.

కాగా, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ పేరిట అత్యధిక వన్డే సెంచరీ రికార్డ్ ఉంది. టెస్టుల్లో బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉంది. ట్వంటీ 20ల్లో ఇప్పటి దాకా క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు ఇరాక్ థామస్ బద్దలు కొట్టాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+