For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్‌పై ఘన విజయం: ముక్కోణపు సిరిస్ విజేతగా ఆస్ట్రేలియా

By Nageshwara Rao
 Tri-series final: Australia beat New Zealand on DLS to win title

హైదరాబాద్: ముక్కోణపు సిరిస్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆక్లాండ్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో చక్కటి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు.

Australia vs New Zealand 2018 Final Scorecard

దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 48 పరుగుల వద్ద మార్టిన్ గుప్టిల్ (21) బిల్లీ స్టాన్‌లేక్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్స్‌తో కలిసి మరో ఓపెనర్ కొలిన్ మున్రో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.

దీంతో కేన్ రిచర్డసన్ బౌలింగ్‌లో మున్రో (29) ఆగర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ దూకుడును ఆసీస్ బౌలర్లు అడ్డుకున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. రాస్ టేలర్ (43) పరుగులు చేసి న్యూజిలాండ్‌ను ఆదుకున్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో ఆగర్ మూడు వికెట్లు తీసుకోగా, ఆండ్రూ టై, రిచర్డ్‌సన్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం 151 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసిన సమయంలో వర్షం అడ్డంకిగా మారింది.

వర్షం ఎంతసేపటికీ తగ్గముఖం పట్టకపోవడంతో అంఫైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో డార్సీ షార్ట్ హాఫ్ సెంచరీతో రాణించగా, డేవిడ్ వార్నర్ (25), ఆష్టన్ ఆగర్ (2), గ్లెన్ మ్యాక్స్ వెల్ (20 నాటౌట్), ఆరోన్ ఫించ్ (18 నాటౌట్)గా నిలిచారు.

న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోథీ, మున్రో, శాంట్నర్ తలో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ ముక్కోణపు టోర్నీలో 233 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది.

టీ20 ముక్కోణపు సిరిస్ ఫైనల్:
న్యూజిలాండ్ 150-9: రాస్ టేలర్ 43*, అగర్ 3-27
ఆస్ట్రేలియా 121-3 (14.4 ఓవర్లు): Short 50 , మున్రో 1-18
డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Wednesday, March 7, 2018, 13:57 [IST]
Other articles published on Mar 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+