For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండీస్‌పై వరుసగా రెండో విజయం.. ట్రై సిరీస్‌ ఫైనల్లో బంగ్లా

Tri-Series 2019: Sarkar, Rahim set up Bangladeshs successful chase of 248 and enters Finals

ఐర్లండ్‌ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో బంగ్లాదేశ్‌ ఫైనల్‌ చేరింది. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది విండీస్‌పై బంగ్లాకు వరుసగా రెండో విజయం. మొదటగా బ్యాటింగ్ చేసిన విండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఓపెనర్ షై హోప్ (87), కెప్టెన్ జేసన్ హోల్డర్ (62) రాణించారు. బంగ్లా బౌలర్లు ముస్తఫిజుర్‌ 4, మోర్తజా 3 వికెట్లు తీశారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

248 పరుగుల లక్ష ఛేదనలో బంగ్లా 47.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఓపెనర్ ముష్ఫికర్‌ రహీమ్‌ (63), సౌమ్య సర్కార్‌ (54) అర్ధ శతకాలు చేయగా.. మిథున్ (43), మహ్మదుల్లా (30) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. విండీస్ బౌలర్ ఆష్లేయ్ నర్స్ మూడు వికెట్లు తీసాడు.

Tri-Series 2019: Sarkar, Rahim set up Bangladeshs successful chase of 248 and enters Finals

ట్రై సిరీస్‌లో వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరుకున్నాయి. ఐర్లండ్‌ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. బుధవారం ఐర్లండ్‌తో నామమాత్రమైన వన్డేను బంగ్లా ఆడనుంది. శుక్రవారం విండీస్‌-బంగ్లా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్‌ ముందు ఈ సిరీస్‌ను సన్నాహంగా ఉపయోగించుకోవాలని విండీస్‌-బంగ్లా జట్లు చూస్తున్నాయి.

Story first published: Tuesday, May 14, 2019, 9:29 [IST]
Other articles published on May 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+