పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌గా వరల్డ్‌కప్ విజేత జట్టు కోచ్.. అనిల్ కుంబ్లేను తప్పించడానికి కారణమిదే

ఐపీఎల్-2023లో ట్రెవర్ బేలిస్‌ను తమ కొత్త ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్లు పంజాబ్ కింగ్స్ శుక్రవారం ధ్రువీకరించింది. ఆయన కోచ్‌గా ఉన్నప్పుడే ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు 2019ప్రపంచకప్ గెలుచుకుంది. ఇంగ్లాండ్‌కు 2019లో ప్రపంచకప్, అలాగే రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్, సిడ్నీ సిక్సర్స్ జట్టుకు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) టైటిల్‌ను అందించిన అనుభవం ట్రెవర్ బేలిస్‌కు ఉంది.
'పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం పట్ల చాలా గౌరవంగా భావిస్తున్నాను. విజయం కోసం నిరంతరం తపన కనబరిచే ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్. ట్రోఫీ కోసం బరిలోకి దిగాలనుకుని నిర్ణయించుకున్న ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి నేను చాలా ఎదురుచూస్తున్నాను' అని బేలిస్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
అనిల్ కుంబ్లేను తప్పించి ట్రెవర్ బేలిస్‌ను
మూడేళ్లుగా పంజాబ్ కింగ్స్ జట్టు కోచ్‌గా అనిల్ కుంబ్లే వ్యవహరిస్తున్నాడు. ఈసారి అతన్ని కాంట్రాక్ట్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ పునరుద్ధరించలేదు. దీంతో అతని స్థానంలో ట్రెవర్ బేలిస్ ఎంపికయ్యాడు. 2014లో పంజాబ్ కింగ్స్ ఒక్కసారి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. పంజాబ్ జట్టుకు అదే అత్యుత్తమ సీజన్. ఐపీఎల్ గత నాలుగు సీజన్లలో పంజాబ్ కింగ్స్ ఆరో స్థానం దాటలేదు. ఈ ఏడాది టోర్నీలో.. కేఎల్ రాహుల్ నుంచి మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీని తీసుకున్నాడు. కానీ అతను బ్యాటింగ్లో రాణించలేకపోయాడు. ఐపీఎల్ 2022కి ముందు పంజాబ్ జట్టులో మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే రిటైన్ చేసుకున్న ప్లేయర్లు.

ఒక్కసారి కూడా ప్లేఆఫ్ చేరుకోలేదు
ఇకపోతే 2020 నుంచి అనిల్ కుంబ్లే పంజాబ్ ఫ్రాంచైజీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను కోచ్‌గా సక్సెస్ కాలేకపోయాడు. 2020లో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పరిమితమైంది. 2021లో అయిదో స్థానంలో నిలిచింది. 2022ఎడిషన్‌లో ఆరో స్థానంలో నిలిచింది. ఒక్కసారి కూడా కుంబ్లే కోచ్‌గా ఉన్నప్పుడు టాప్ 4 (ప్లేఆఫ్)కు చేరుకోలేదు. దీంతో అందుకే అతన్ని తప్పించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదనే సంగతి తెలిసిందే.

ఆరో కోచ్‌గా ట్రెవర్ బేలిస్
ఇకపోతే అనిల్ కుంబ్లే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి అయిదో కోచ్‌గా పనిచేయగా.. ఆరో కోచ్‌గా ట్రెవర్ బేలిష్ జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతకుముందు సంజయ్ బంగర్ (2014-16), వీరేంద్ర సెహ్వాగ్ (2017), బ్రాడ్ హాడ్జ్ (2018), మైక్ హెస్సన్ (2019) ఆ జట్టు కోచ్‌లుగా వ్యవహరించారు. ఇక 2020లో పంజాబ్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ బాధ్యతలను అనిల్ కుంబ్లే చేపట్టాడు. అతని హాయంలో పంజాబ్ 42 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 18మాత్రమే గెలవగలిగింది. 22ఓడిపోయింది. రెండు టై అయ్యాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications