6 రన్స్: చారిత్రాత్మక రికార్డుని తృటిలో కోల్పోయిన దక్షిణాఫ్రికా
హైదరాబాద్: దక్షిణాఫ్రికా చారిత్రాత్మక వన్డే రికార్డుకి ఆతిథ్య న్యూజిలాండ్ బ్రేక్ వేసింది. ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో గెలిచిన దక్షిణాఫ్రికా, ఆపై ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది. తద్వారా దక్షిణాఫ్రికా వన్డేల్లో అత్యధికంగా వరుసగా 12 విజయాలు సాధించిన రెండో జట్టుగా నిలిచింది.
అంతక ముందు పాకిస్థాన్ జట్టు కూడా 12 వరుస విజయాలతో ఉన్న రికార్డుని దక్షిణాఫ్రికా సమం చేసింది. ఈ క్రమంలో తొలి వన్డేలో ఓటమిపాలైన న్యూజిలాండ్ బుధవారం క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన రెండో వన్డేలో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా దక్షిణాఫ్రికా ఓ అరుదైన రికార్డుని చేజార్చుకుంది.
ఇప్పటివరకూ వన్డేల్లో వరుసగా 12 విజయాలు సాధించి పాక్‌తో సమానంగా రెండో స్ధానంలో నిలిచిన దక్షిణాఫ్రికా మరో విజయాన్ని సాధిస్తే 13 మ్యాచ్‌లతో ఈ జాబితాలో రెండో స్ధానంలో ఉండేది. పాకిస్థాన్ మూడో స్ధానానికి పరిమితమయ్యేది. ఈ జాబితాలో 21 వరుస వన్డే విజయాలతో ఆస్ట్రేలియా మొదటి స్ధానంలో ఉంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 4 వికెట్లను కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో రాస్ టేలర్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 283 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది.
వన్డేల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లు:
2002-03 సీజన్లో ఆస్ట్రేలియా 21 వరుస వన్డే విజయాలు
2004-05 సీజన్లో దక్షిణాఫ్రికా 12 వరుస వన్డే విజయాలు
2007-08 సీజన్లో పాకిస్తాన్ 12 వరుస వన్డే విజయాలు
2016-17 సీజన్లో దక్షిణాఫ్రికా 12 వన్డే విజయాలు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications