Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి వన్డేలో పాక్ ఓటమి: హ్యాట్రిక్‌తో ట్రెంట్ బౌల్డ్ అరుదైన రికార్డు

Trent Boult hat-trick leads New Zealand to comprehensive ODI win over Pakistan

హైదరాబాద్: అబుదాబి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 'హ్యాట్రిక్‌' తీయడంతో ఆతిథ్య పాకిస్థాన్‌పై 47 పరుగులతో విజయం సాధించింది. బౌల్ట్ తన హ్యాట్రిక్‌తో పాక్ టాపార్డర్‌ను కుప్ప కూల్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌల్ట్

పాక్ బ్యాట్స్‌మెన్లను ఫకార్‌ జమాన్‌, బాబర్‌ అజాం, మహ్మద్‌ హఫీజ్‌లను వరుస బంతుల్లో పెలివియన్‌కు చేర్చాడు. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్(64)‌, ఇమాద్‌ వాసిం(50) హాఫ్ సెంచరీలతో రాణించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 266/9

న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గుసన్‌ మూడు వికెట్లు తీయగా... గ్రాండ్‌ హోమ్ రెండు వికెట్లు తీసాడు. ఇష్ సోధికి ఒక వికెట్‌ లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. రాస్ టేలర్‌(80), లాంథమ్‌ (68) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.

మూడో పురుష బౌలర్‌గా బౌల్ట్ రికార్డు

పాక్‌ బౌలర్లలో షహీన్‌ షా ఆఫ్రిది, షదబ్‌ ఖాన్‌ నాలుగేసి వికెట్లు పడగొట్టగా... ఇమాద్‌ వాసిం ఒక వికెట్‌ లభించింది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ట్రెంట్ బౌల్ట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, కివీస్ తరుపున వన్డేల్లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన మూడో పురుష బౌలర్‌గా ట్రెంట్‌ బౌల్ట్‌గా నిలిచాడు. గతంలో డానీ మోరిసన్‌, షేన్‌ బాండ్‌ ఈ ఘనత సాధించారు.

Story first published: Thursday, November 8, 2018, 11:30 [IST]
Other articles published on Nov 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+