రాయ్‌పూర్: నేపాల్‌లో మంగళవారం మరో భూకంపం సంభవించింది. తాజాగా సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించింది. ఈ భూకంప ప్రభావం దక్షిణి భారత దేశంపై కూడా ప్రభావం చూపింది.
ఈ భూకంప తాకిడి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈరోజు ఢిల్లీ డేర్ డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ రాయపూర్‌కి తాకింది. రాయపూర్‌లోని స్టేడియంలో ఉన్న మాజీ శ్రీలంక ఆల్ రౌండర్ రస్సెల్ ఆర్నాల్డ్ తన భూకంప అనుభూతిని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం చంఢీగడ్‌లో ఉన్న ఆస్టేలియా మాజీ ఆటగాడు డామిన్ మార్టిన్ కూడా ట్విట్టర్‌లో స్పందించాడు. చంఢీగడ్‌లో కూడా ఈ భూ ప్రకంపనలను వచ్చాయని పేర్కొన్నాడు. నేపాల్ భూకంప ప్రభావం చండీగడ్‌లోని మా హోటల్‌పై కూడా పడిందన్నారు. అయితే అంతా క్షేమంగానే ఉన్నామని ట్వీట్ చేశాడు.