వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీసులో భారత జట్టు ఘోరంగా ఓడింది. ఈ సిరీసులో ముఖ్యంగా కేరళ యంగ్‌స్టర్ సంజూ శాంసన్ విఫలం అవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సంజూకు టీమిండియాలో అవకాశాలు రావడమే అరుదని, అలాంటి అవకాశాలు వస్తే వాటిని వృధా చేసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయంపై ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. సంజూను కూడా రోహిత్ శర్మలాగే టాపార్డర్‌లో ఉపయోగించుకోవాలని సూచించాడు. 'సంజూ ట్యాలెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటే.. అతన్ని టాపార్డార్‌లో ఆడించాలి. ఏ ఫార్మాట్ అయినా సరే అతన్ని టాపార్డర్‌లోనే ఆడించాలి' అని చోప్రా చెప్పాడు.

'సంజూ ట్యాలెంట్‌కు న్యాయం చేయాలంటే అంతకుమించి మరో మార్గం లేదు. అతన్ని టాపార్డర్‌లో ఆడించాలి. ఒక విధంగా రోహిత్ శర్మ విషయంలో కూడా టీమిండియా చేసిందదే' అని అభిప్రాయపడ్డాడు. రోహిత్ కెరీర్ ఆరంభంలో మిడిల్, లోయర్ ఆర్డర్‌లో ఆడించారు. కానీ సెహ్వాగ్, గంభీర్ రిటైర్ అయిన తర్వాత ధోనీ అతన్ని ఓపెనర్‌గా ఆడించాడు.
ఈ రోల్‌లో సక్సెస్ అయిన రోహిత్ వైట్ బాల్ క్రికెట్‌లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. బెస్ట్ ఓపెనర్లలో తను ఒకడని నిరూపించుకున్నాడు.. 'రోహిత్ ఆడేటప్పుడు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతకుముందు కూడా అతని ఆట అలాగే ఉండేది. పెద్దగా పరుగులు చేయకపోయినా కూడా.. అతనికి అందుకే అవకాశాలు వచ్చేవి' అని చోప్రా గుర్తుచేశాడు.
'రోహిత్‌లో చాలా సత్తా ఉందని అనిపించేది. అందుకే అతనికి అన్ని అవకాశాలు ఇచ్చారు. సంజూ విషయంలో కూడా ఇప్పుడు కనిపిస్తున్న ట్యాలెంట్.. ఫ్యూచర్‌లో పెర్ఫామెన్స్‌గా మారే అవకాశం ఉంది' అన్నాడు. అయితే ప్రస్తుతం అతన్ని టాపార్డర్‌లో ఆడించడం కుదరకపోవచ్చని కూడా చోప్రా అభిప్రాయపడ్డాడు.
కానీ సంజూకు ఇంకా 29 ఏళ్లు కూడా లేవని, సీనియర్లు తప్పుకున్న తర్వాత ఫ్యూచర్ అంతా తనదేనని చెప్పుకొచ్చాడు. సంజూ ఓపెనర్‌గా లేదా మూడో స్థానంలో రాణిస్తున్నాడని, ఆ నెంబర్లు చూసి అతన్ని జట్టులోకి తీసుకుంటున్నామని చోప్రా అన్నాడు. కానీ జట్టులో అతన్ని లోయర్ ఆర్డర్‌లో ఆడిస్తే ఫలితం ఏంటన్నాడు.